Begin typing your search above and press return to search.
వైసీపీ ఇన్ చార్జ్‌గా జనసేన ఎమ్మెల్యే.. సంబరాల్లో వైసీపీ ఎంపీ..!
By: Tupaki Desk | 2 Nov 2021 2:30 PM GMTగత సాధారణ ఎన్నిక ల్లో ఏపీ లో జనసేన గెలిచిన ఓకే ఒక సీటు తూర్పు గోదావరి జిల్లా లోని రాజోలు. పార్టీ అధినేత గా పవన్ కళ్యాణ్ సైతం తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడి పోయారు. అయితే రాజోలు లో మాత్రం రాపాక గెలిచారు. కొద్ది రోజుల పాటు ఆయన జనసేన లో తానే నెంబర్ వన్ ఎమ్మెల్యేను అని చెప్పుకున్నా తర్వాత కొద్ది రోజుల కే వైసీపీ చెంత చేరి పోయారు. తన తనయుడి ని వైసీపీ లో చేర్పించారు. ఇటీవల ఆయన కూడా వైసీపీ కండువా కప్పుకుని ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సైతం రాపాక ను పట్టించుకోవడం మానేశారు. రాజోలు లో జనసేన తరపున మరో క్యాండెట్ ను వెతుక్కునే పని లో పవన్ తో పాటు ఆ పార్టీ స్థానిక కేడర్ ఉంది. మరో వైపు రాపాక వైసీపీ చెంత చేరడం తో రాజోలు వైసీపీ మూడు ముక్కలు గా చీలిపోయింది. రాపాక ది ఓ వర్గం... అమలాపురం ఎంపీ చింతా అనూరాధది మరో వర్గం.. గత రెండు ఎన్నికల్లోనూ అక్కడ వైసీపీ క్యాండెట్ గా ఓడిపోతోన్న బొంతు రాజే శ్వర్ రావు ది మరో వర్గం.
రాజోలు వైసీపీ తెరవెనక ఉండి నడిపించే క్షత్రియ సామాజిక వర్గం నేతలు రాపాకను వైసీపీ ఇన్ చార్జ్ గా చేయాలని కొద్ది రోజులు గా లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వారీ లాబీయింగ్ సక్సెస్ అయ్యిందని.. రాపాకే రాజోలు వైసీపీ ఇన్ చార్జ్ అంటూ వార్తలు పుకార్లు.. షికార్లు చేస్తున్నాయి. రాపాకను ఇన్ చార్జ్ గా గోదావరి జిల్లాల పార్టీ ఇన్ చార్జ్ గా ఉన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ప్రకటించారంటూ రాపాక వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నిక ల్లో రాజు లో వైసీపీ టిక్కెట్ కూడా తమ నేత దే అని వారు చెప్పుకుంటున్నారు.
విచిత్రం ఏంటంటే ఈ సంబరాల్లో అమలాపురం వైసీపీ ఎంపీ చింతా అనూరాధ కూడా పాల్గొన్నారు. ఇకపై రాజోలు వైసీపీ కార్యకర్తలు అంతా రాపాక చెప్పినట్టే ఉండాలని.. ఆయన అడుగు జాడల్లోనే నడుచు కోవాలని ఆమె సూచించారు. దీంతో రాజు లో వైసీపీ కేడర్ లో ఎక్కడా లేని గందరగోళం నెలకొంది. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీ లో చేర్చుకోనని చెప్పిన జగన్ అనధికారికంగా వారిని పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఇప్పుడు రాపాకకు నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి ఎలా ? ఇస్తారంటూ పార్టీ కేడర్ ప్రశ్నిస్తోంది.