Begin typing your search above and press return to search.
ప్రమోషన్లో వైసీపీ సర్కార్ అట్టర్ ఫ్లాప్!
By: Tupaki Desk | 21 Sep 2019 7:15 AM GMTసాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కావడమే గగనం. గత పదేళ్లలో ఆ వ్యవహారాన్ని అంతా గమనించారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఏవో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడి హయాంలో నోటిఫికేషన్ల జాడే లేదు.చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంతసేపూ ఏపీపీఎస్సీకి అసలు పనే ఉండదని నిరుద్యోగులు అంటూ ఉంటారు.
కనీసం ఐదారువందల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఐదేళ్లలో. అలాంటిది జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే భారీ రిక్రూట్ మెంట్ విడుదల చేశారు. భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని చేపట్టారు. విలేజ్ సెక్రటేరియట్ పోస్టుల కోసం యువత ఉత్సాహం చూపించింది. దాదాపు ఇరవై లక్షల మంది ఎగ్జామ్ రాశారు. మరి ఇలాంటి కార్యక్రమానికి సంబంధించి సరైన ప్రమోషన్ మాత్రం చేసుకోలేకపోయింది జగన్ సర్కార్. ఫలితాల విడుదల కార్యక్రమం అయితే మరీ సాదాసీదాగా జరిగింది.
ఫలితాల విడుదల సందర్భంగా చిన్న ప్రెస్ మీట్ కూడా లేదు. ముఖ్యమంత్రి - మంత్రులు కలిసి ఫలితాలను విడుదల చేశారు. బయటి కెమెరాలను లోపలకు అనుమతిని కూడా ఇవ్వలేదు!
ఏ మాత్రం హడావుడి లేకుండా.. అన్ని వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలు విడుదల కావడం గమనార్హం. తాము చేపట్టిన జంబో రిక్రూట్ మెంట్ కు సంబంధించి ప్రమోషన్ చేసుకోవడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు అట్టర్ ఫ్లాప్ అయ్యిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ఇలాంటి ప్రోగ్రేమే వేరే ప్రభుత్వాల హయాంలో జరిగి ఉంటే.. ప్రెస్ మీట్లు, ప్రచార హడావుడి బోలెడంత ఉండేదని.. జగన్ ప్రభుత్వం మాత్రం అలాంటి ప్రచారాన్ని చేసుకోలేకపోయిందని విశ్లేషకులు అంటున్నారు.