Begin typing your search above and press return to search.

30 మంది జాబితా రెడీ చేసుకున్న వైసీపీ.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   10 Jan 2023 11:38 AM GMT
30 మంది జాబితా రెడీ చేసుకున్న వైసీపీ.. రీజ‌న్ ఇదే!
X
ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న అధికార పార్టీ వైసీపీ దాదాపు 30 మంది ఎమ్మెల్యేల‌ను ప‌క్క న పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. వీరిలో కొత్త, పాత‌, సీనియ‌ర్ నేతలు కూడా ఉన్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ప్ర‌స్తుతం 30 పేర్ల వ‌ర‌కు వైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తు్న్నాయి. వీరిని ప‌క్క‌న పెట్ట‌డం ఖాయ‌మ‌ని కూడా అంటున్నారు. వీరిలో కొంద‌రు సీనియ‌ర్లు, జ‌గ‌న్ తో క‌లిసి పాద‌యాత్ర చేసిన వారు కూడా ఉన్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం వినిపిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప‌రిశీలిస్తే.. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా జిల్లా గూడూరు, వెంక‌ట‌గిరి, నెల్లూరు రూర‌ల్‌, ఉద‌య‌గిరి, ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లా రాజంపేట అసెంబ్లీ, హిందూపురం పార్ల‌మెంటు, ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కైక‌లూరు, నందిగామ‌, తిరువూరు, క‌ర్నూలు జిల్లాలోని పాణ్యం, నందికొట్కూరు, తిరుప‌తి, చిత్తూరు పార్ల‌మెంటు, క‌నిగిరి, గిద్ద‌లూరు, శ్రీకాళ‌హ‌స్తి, ప‌ల‌మ‌నేరు న‌నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పు త‌థ్య‌మ‌ని చెబుతున్నారు.

అదేవిధంగా.. శ్రీకాకుళంలోనూ.. మార్పులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు. ఎచ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో మార్పు ఖాయ‌మ‌ని తెలుస్తోంది. అదేవిధంగా విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, విశాఖలోని భీమిలి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మార్పులు చేస్తార‌ని స‌మాచారం. ఉమ్మ‌డి ప‌శ్చిమ‌లోని ఏలూరు, ఆచంట‌, తాడేప‌ల్లిగూడెం, న‌ర‌సాపురం అసెంబ్లీ(ప్ర‌సాద‌రాజును వేరేస్థానానికి బ‌దిలీ చేయ‌నున్నారు), న‌ర‌సాపురం పార్ల‌మెంటు(ఇది ఖాయం అనే విష‌యం తెలిసిందే). ఇలా.. మార్పులుత‌ప్ప‌వ‌ని వైసీపీలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం లేక‌పోవ‌డం.. ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌డం.. టీడీపీ బ‌లంగా పుంజుకోవ‌డం వంటి కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.