Begin typing your search above and press return to search.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కుభేరులున్నారో!
By: Tupaki Desk | 23 Jan 2019 8:33 AM GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కుభేరులున్నారనే అంశం త్వరలోనే తేలిపోతుందట. ఈ మేరకు అధినాయకత్వం తమ వారికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎవరెవరు ఏ స్థాయిలో ఖర్చు పెట్టుకోగలరో చెప్పుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తమ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
రానున్న ఎన్నికలకు సన్నద్ధం విషయంలో డబ్బుది కూడా కీలక పాత్రే అని వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. ఓటుకు ఐదు వేల రూపాయలు అయినా ఖర్చు పెట్టేందుకు పలువురు తెలుగుదేశం నేతలు సిద్ధంగా ఉన్నారు. ఐదేళ్ల అధికారంలో భారీ మొత్తాలను కూడ బెట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్లు.. ఈ సారి గెలవడానికి ఎంత ఖర్చు పెట్టడానికి అయినా సై అని అంటున్నారు. ఇందుకు తగ్గట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అయితే ఎంతైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు ఖర్చు పెట్టడం అంటే అది భారీగా కుదిరే పని కాదు.
ఇలాంటి నేపథ్యంలో తమ వాళ్ల సత్తా ఏమిటో వైసీపీ అధినాయకత్వం తెలుసుకోవాలని అనుకుంటోందట. అందుకే అనధికారికంగా ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయని టాక్. ఎవరు ఏ స్థాయిలో ఖర్చు పెట్టుకోగలరో వివరణ ఇవ్వాలని కోరారట. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుత రోజుల రాజకీయంలో డబ్బులు లేకుండా ఎన్నికలను ఎదుర్కోవడం కుదిరే పని కాదు. అది నిజమే. అయితే నేతల ఆర్థిక స్తోమత విషంలో పార్టీనే ఒక అంచనాకు రావాలి. ఏదోలా సమాచారం తెలుసుకుని.. ఎవరు ఎంత పెట్టుకోగలరనే అంశంపై అంచనాలు వేసుకోవాలి. అయితే వైసీపీ నాయకత్వం మాత్రం… ఎవరి స్థాయి ఏమిటో వాళ్లనే చెప్పాలని అడుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పుడు వైసీపీలో ఎంతమంది కుభేరులున్నారో - ఎంతమంది ఖర్చు పెట్టే శక్తి లేని వాళ్లున్నారో తెలిసిపోతుందేమో!