Begin typing your search above and press return to search.
బీజేపీనా.? వైసీపీనా? దగ్గుబాటి తేల్చుకోవాలి.?
By: Tupaki Desk | 10 Oct 2019 5:18 AM GMTఒక్కటే కుటుంబం.. భార్య బీజేపీలో.. భర్త వైసీపీలో.. పొద్దున లేస్తే పురంధేశ్వరి బీజేపీ నాయకురాలి హోదాలో జగన్ ను - వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకుంటోంది. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో పర్చూర్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైందన్న చర్చ ఆ పార్టీలో సాగుతోందట..
దగ్గుబాటి వెంకటేశ్వరరావు - పురంధేశ్వరి.. కొన్నాళ్ల క్రితం వరకూ కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన వీరిద్దరూ ఇప్పుడు ఏపీ రాజకీయంలో చెరోదారి ఎంచుకున్నారు. పురంధేశ్వరి బీజేపీలో చేరగా.. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మొన్నటి ఎన్నికల ముందర వైసీపీలో చేరారు. ప్రకాశం జిల్లా పర్చూర్ నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. అక్కడితో ఆగితే అంతా అయిపోయేది.
కానీ ఏపీ రాజకీయాల్లోకి బీజేపీ దూసుకొచ్చింది. టీడీపీ నేతలను లాగేసింది. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీకావు.. బీజేపీలో కీలక నాయకురాలైన పురంధేశ్వరి కూడా జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.
ఇలా భర్త దగ్గుబాటి వైసీపీలో ఉంటే.. భార్య పురంధేశ్వరి తిట్టడం వైసీపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందట.. ఈ నేపథ్యంలో పురంధేశ్వరితో బీజేపీకి రాజీనామా చేయించాలని.. లేదంటే దగ్గుబాటి వైసీపీని వీడాలని జగన్ అల్టీమేటం జారీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పర్చూర్ నియోజకవర్గ బాధ్యతలను తాజాగా దగ్గుబాటి రాకతో పార్టీ వీడిన రామనాథంబాబుకు జగన్ అప్పగించినట్టు తెలిసింది.
రామనాథం బాబు పర్చూర్ నియోజకవర్గంలో యాక్టివ్ కావడంతో ఈ వ్యవహారంపై తేల్చుకునేందుకు దగ్గుబాటి తాజాగా జగన్ - విజయసాయిరెడ్డిలను కలవడానికి అపాయింట్ మెంత్ కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదట.. సో ఇప్పుడు దగ్గుబాటికి రెండే దారులున్నాయన్న చర్చ పార్టీలో సాగుతోంది. పురంధేశ్వరితో సహా వైసీపీలో కొనసాగడం.. లేదంటే వైసీపీని వీడి బీజేపీలో చేరిపోవడం.. జగన్ ను కలిశాక నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనలో ప్రస్తుతం ప్రకాశం జిల్లాకు దూరంగా దగ్గుబాటి హైదరాబాద్ లో ఉంటున్నట్టు సమాచారం.