Begin typing your search above and press return to search.

ఇప్ప‌టికీ అదే డౌట్‌.. టీడీపీ కంచుకోటల్లో వైసీపీ పాగా..!

By:  Tupaki Desk   |   4 July 2022 6:15 AM GMT
ఇప్ప‌టికీ అదే డౌట్‌.. టీడీపీ కంచుకోటల్లో వైసీపీ పాగా..!
X
ఔను.. ఇప్ప‌టికీ టీడీపీ త‌మ్ముళ్ల‌కు అదే డౌట్.. త‌మ పార్టీకి కంచుకోట‌ల్లా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎలా పుంజుకుంది? ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా, ఉభ‌య గోదావ‌రులు, శ్రీకాకుళం.. ఇలా పలు జిల్లాల్లో వైసీపీ ఎలా దూకుడు ప్ర‌ద‌ర్శించింది? అనేది టీడీపీ నేత‌ల మ‌ధ్య మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఎం దుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైం ది. ఇలా ఎందుకు జ‌రిగింద‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచి విజ‌యం ద‌క్కించుకుంటున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. ఉదాహ‌ర‌ణ‌కు తాడిప‌త్రి, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, కొవ్వూరు(ప‌శ్చిమ గోదావ‌రి), ఏలూరు, దెందులూరు, పెన‌మ‌లూరు, గుర‌జాల‌, వినుకొండ‌. ఇలా అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. పైగా వీరిపై ఎలాంటి ఆరోప‌ణ‌లు కూడా లేవు. ప్ర‌జ‌ల‌కు చేరువైన నాయ‌కులు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే నాయ‌కులే ఉన్నారు. అయితే.. వీరంతా ఓడిపోయారు.

ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు సైతం కాలికి చెప్పులు అరిగిపోయేలా తిరిగి ప్ర‌చారం చేశారు. అయి నా కూడా వీరు ఓడిపోయారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. అయితే.. పార్టీ ఎందుకు ఇ క్కడ ఓడిపోయింది? అనేది ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉంది.

కొన్నాళ్ల కింద‌ట పార్టీ ఇంచార్జ్‌ల‌తో తెప్పించుకు న్న నివేదిక‌ల్లో కూడా 'అంతా బాగానే ఉంది' అనే రిపోర్టు వ‌చ్చింది. మ‌రి ఎలా వీరంతా ఓడిపోయారు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఈ నేప‌థ్యంలో అంద‌రి దృష్టీ ఈవీఎంల‌పైనే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈవీఎంలు మంచివే అయిన‌ప్ప‌టికీ.. వీటిని టాంప‌రింగ్ చేసే అవ‌కాశం ఉన్నందున ఫ‌లితం తారుమారు అయి ఉంటుంద‌నే చ‌ర్చ అప్ప‌టి నుంచి ఉంది.

అయితే.. ప్ర‌స్తుతం రాష్ట్రప‌తి ఎన్నిక‌లు.. బ్యాలెట్ విధానంలో జ‌రుగుతున్నప్పుడు సార్వ త్రిక ఎన్నిక‌ల‌ను కూడా ఈ విధానంలోనే ఎందుకు నిర్వ‌హించ‌కూడద‌నే చ‌ర్చ‌. అయితే.. ఈ విష‌యంలో టీడీపీ ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని.. ఈవీఎంల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం.