Begin typing your search above and press return to search.

ఇక వైసీపీ ప్ర‌యివేటు బిల్లు

By:  Tupaki Desk   |   22 July 2016 10:01 AM GMT
ఇక వైసీపీ ప్ర‌యివేటు బిల్లు
X
ఒక్క ప్ర‌యివేటు బిల్లుతో ఫుల్లు మైలేజి సంపాదించిన కాంగ్రెస్ ను చూసి వైసీపీకి కూడా అదే ఆలోచ‌న వ‌చ్చింది. ఈ ప‌ని తాము ముందే ఎందుకు చేయ‌లేదా అని బాధ‌ప‌డుతుతోంది. అయితే.. ఆల‌స్యం అయింది కానీ, ఇంకా ఛాన్సు ఉందిలే అనుకుంలూ తామూ ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యించింది. అయితే... కేవీపీ రాజ్య‌స‌భ‌లో ప్ర‌త్యేక హోదా కోసం ఈ బిల్లు పెట్ట‌గా వైసీపీ లోక్ స‌భ‌లో అదే ఎత్తుగ‌డ వేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఏపీ కి ప్ర‌త్యేక హోదా కోరుతూ లోక్ స‌భ‌లో ప్ర‌యివేటు మెంబ‌ర్ బిల్లు పెట్టాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది.


ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో మరింత గట్టి వాదన వినిపించ‌డానికి రెడీ అవుతోంది. కేవీపీ రాజ్య‌స‌భ‌లో పెట్టిన బిల్లుపై గత సమావేశాల్లోనే చర్చ ముగియగా, ఈ రోజు దానిపై ఓటింగు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. దీంతో ఇది దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన అంశంగా మారింది. ఈ బిల్లు కాంగ్రెస్ ను మ‌ళ్లీ ఒక పొజిష‌న్లోకి తెచ్చింది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరు సాగిస్తున్నామని చెప్పుకుంటున్న వైసీపీ లోక్ సభలో ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించేందుకు సిద్ధపడింది. ఈ మేరకు ఆ పార్టీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి - ఒంగోలు లోక్ సభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ప్రైవేటు బిల్లును ప్రతిపాదించనున్నట్లు ప్రకటించారు.

అయితే.. రాజ్య‌స‌భ‌లో బిల్లు కోసం కాంగ్రెస్ మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టిన స్థాయిలో వైసీపీ మిగ‌తా పార్టీల మద్ద‌తు పొంద‌గ‌ల‌దా అన్నది అనుమాన‌మే. లోక్ స‌భ‌లో దానిపై చ‌ర్చ జ‌ర‌గ‌డం కూడా క‌ష్ట‌మే అన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి ప్ర‌యివేటు బిల్లుతో ప్ర‌త్యేక హోదా వ‌స్తుందా లేదా అన్నది ప‌క్క‌న‌పెడితే దాంతో రాజ‌కీయంగా మాత్రం లాభ‌మే అని అన్ని పార్టీలూ అర్థం చేసుకున్న‌ట్లుగా ఉంది.