Begin typing your search above and press return to search.

బాలకృష్ణకు వైఎస్సార్సీపీ నేత సూచన - సాధ్యమయ్యేదేనా?

By:  Tupaki Desk   |   28 May 2019 7:55 AM GMT
బాలకృష్ణకు వైఎస్సార్సీపీ నేత సూచన - సాధ్యమయ్యేదేనా?
X
అనంతపురం జిల్లాలో ఈ దఫా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. అత్యంత భారీ మెజారిటీలతో వివిధ అసెంబ్లీ నియోజక వర్గాలను జగన్ పార్టీ గెలుచుకుంది. పద్నాలుగు అసెంబ్లీ సీట్లలో ఏకంగా పన్నెండు సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. అది కూడా భారీ మెజారిటీలు దక్కాయి జగన్ పార్టీకి.

ఉరవకొండ సీటును స్వల్ప ఓట్ల తేడాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఒక్క హిందూపురంలో మాత్రమే తెలుగుదేశం పార్టీ నెగ్గింది. అక్కడ పదిహేను వేలకు పైగా మెజారిటీలో బాలకృష్ణ నెగ్గారు. బాలకృష్ణ నెగ్గడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి కూడా ఉందని చెప్పకతప్పదు. అక్కడ పదే పదే ఇన్ చార్జిలను మార్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ఒకసారి ఓడిన నవీన్ నిశ్చల్ కు గనుక జగన్ అవకాశం ఇచ్చి ఉంటే.. గట్టి పోరాటానికి అవకాశం ఉండేది.

నవీన్ నిశ్చల్ స్థానంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అబ్ధుల్ ఘనీకి అవకాశం అని ప్రచారం జరిగింది. అయితే అంతలోనే మళ్లీ అభ్యర్థిత్వం మారిపోయింది. తను పోటీ చేయనంటూ ఘనీ అడ్డం తిరిగారు. ఆయన స్థానంలో ఇక్బాల్ కు అవకాశం ఇచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇలా వరసగా ఇన్ చార్జిలు మారిపోవడంతో అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తలకిందుల అయ్యింది.

ఈ నేతల మధ్యన సహకారం కూడా కొరవడింది. ఇక్బాల్ గెలిస్తే తమకు హిందూపురంలో రాజకీయ భవితవ్యం ఉండదని ఘనీ - నవీన్ నిశ్చల్ భావించే అవకాశం ఉండింది. దీంతో బాలకృష్ణకు మార్గం సుగమం అయ్యింది. అంత వైఎస్ ఆర్సీపీ గాల్లో కూడా బాలకృష్ణ నెగ్గడం వెనుక ఈ రీజన్లు కూడా ఉన్నాయి,.

ఆ సంగతలా ఉంటే.. బాలకృష్ణకు ఇక్బాల్ ఒక సూచన చేశారు. తాము హిందూపురం అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తామని ప్రకటించుకున్న ఇక్బాల్.. ఇదే సమయంలో బాలకృష్ణకు ఒక మాట చెప్పారు. హిందూపురంలోనే మకాం పెట్టాలని - హిందూపురంలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి పని చేయాలని బాలయ్యకు ఇక్బాల్ సూచించారు. అయినా సినిమా హీరోగా బిజీగా ఉన్న బాలకృష్ణ హిందూపురంలో మకాం పెట్టడం సాధ్యం అయ్యే పనేనా?