Begin typing your search above and press return to search.

మంత్రి బొత్స మాటలు.. వైసీపీకి ఇబ్బందిగా మారుతున్నాయా!

By:  Tupaki Desk   |   29 Nov 2019 2:30 PM GMT
మంత్రి బొత్స మాటలు.. వైసీపీకి ఇబ్బందిగా మారుతున్నాయా!
X
సీనియర్ పొలిటీషియనే అయినప్పటికీ బొత్స సత్యనారాయణ ప్రత్యర్థులకు ఆయుధాలను అయితే అందించడం ఆగడం లేదు. తెలుగుదేశం పార్టీ ఏ విషయాల్లో అయితే వివాదాలు రేపుతూ ఉంటుందో.. వాటి వెనుక బొత్స సత్యనారాయణ ప్రకటనలే ఉండటం గమనార్హం.

రాజధాని విషయంలో బొత్స సత్తిబాబు చేసిన పలు ప్రకటనలు ఇప్పటి వరకూ వివాదాల పాలయ్యాయి. రాజధానిని మార్చే ఉద్ధేశం లేనట్టుగా జగన్ కనిపిస్తున్నా సత్తిబాబు తనకు తోచిన ప్రకటనలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పటి వరకూ రాజధానిని మార్పు విషయంలో అధికారిక ప్రకటనలు రాలేదు. ఈ నేపథ్యంలో తన వల్లనే రాజధానిని మార్చే ఆలోచనను జగన్ విరమించుకున్నారంటూ చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు.

అవకాశం దొరికితే చంద్రబాబు నాయుడి కోటరీ ఇలాంటి ప్రచారాలను బోలెడన్ని చేయగలదు. అలాంటి అవకాశం ఇస్తున్నది మాత్రం సత్తిబాబే.

ఇక రాజధానిని శ్మశానం అంటూ బొత్స చేసిన ప్రకటన మీద తెలుగుదేశం పార్టీ తెగ రెస్పాండ్ అయ్యింది. రాజధానిలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టిన విషయాన్నీ ప్రకటించకుండా.. బొత్స చేసిన వ్యాఖ్యానాన్ని పట్టుకుని తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేస్తూ ఉంది. ఈ విషయంలో తెలుగుదేశం అనుకూల మీడియా - అనుకూల సోషల్ మీడియా కూడా రెచ్చిపోయింది.

అసలు విషయాలను వదిలి కొసరు విషయాలను టీడీపీ పట్టుకుంటుంది. అలాంటి కొసరు కామెంట్లను చంద్రబాబు గ్యాంగుకు బొత్స అందిస్తున్నట్టుగా ఉన్నారు. ఈ మాటలు వైసీపీకి ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.