Begin typing your search above and press return to search.
హిందూపురంలో బాలయ్య ఇమేజ్ పెంచుతోన్న వైసీపీ...!
By: Tupaki Desk | 29 Sep 2022 6:42 AM GMTరాజకీయాల్లో ఇమేజ్ పెరగాలంటే.. ప్రజలను నమ్ముకోవాలి. వారి మధ్య ఉండాలి. కానీ, వైసీపీ నాయకు లు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఈ విషయాన్ని పక్కన పెట్టి.. రాద్ధాంతాలను నమ్ముకున్నారనే వాదన వినిపిస్తోంది. దీనివల్ల తమ ఇమేజ్ ఏదో పెరుగుతుందని భావిస్తున్నారు. కానీ, దీనివల్ల. ఎలాంటి ప్రయోజనం లేదనేది.. గతంలో ఎదురైన అనేక అనుభవాలు ఉన్నాయి. తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీపై వైసీపీ నేతలు యాగీ చేస్తున్నారు.
కొందరు హిజ్రాలను పోగు చేసి.. సిట్టింగ్ ఎమ్మెల్యే, నటుడు, టీడీపీ నాయకుడు బాలకృష్ణపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లదేని.. ప్రజల మధ్య తిరగడం లేదని.. ఆయన కనిపిస్తే.. చెప్పాలని పెద్ద ఎత్తున పోస్టర్లు కూడా అంటించారు. అదేసమయం లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వాస్తవానికి.. వైసీపీ నేతలు కూడా.. ఇలానే వ్యవహరిస్తున్నారని.. చాలా నియోజకవర్గాల్లో టాక్ ఉంది.
ఒక్క సత్యసాయి జిల్లాలోనే కాదు.. అన్ని జిల్లాల్లోనూ.. ఇదే పరిస్థితి ఉంది. మరి వారి మాటేంటి? అనేది ప్రశ్న. ఇలాంటి ప్రచారం వల్ల బాలయ్యకు ఏమవుతుందో తెలియదు..కానీ, సొంత పార్టీ నాయకులకు మాత్రం పెను విఘాతం కలుగుతుందని అంటున్నారు.
ఎందుకంటే.. బాలయ్య ఓడిపోయినా... సినిమాలు చేసుకుంటాడు. ఆయనకు ఇబ్బంది లేదు. కానీ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏం చేయాలో అది తక్కువ కాకుండా చూసుకుంటాడు.
ఇక నియోజకవర్గ వైసీపీలో ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్ గ్రూపుల గోలతో అధికార పార్టీ కేడర్ రెండుగా చీలిపోయింది. అసలు ఇక్కడ వైసీపీ నేతలు కూడా.. ప్రజల మధ్య ఉండడం లేదు. ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా చెబుతున్నారు. అయినా కూడా వారు మారడం లేదు. ఏదేమైనా జగన్ పట్టించుకోకపోవడంతో పాటు స్థానిక వైసీపీ నేతల తీరుతో వారే స్వయంగా వచ్చే ఎన్నికల్లోనూ బాలయ్యను సింపుల్‌గా గెలిపించేలా ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.