Begin typing your search above and press return to search.

అధినేత‌పైనే అన్ని కేసులు.. మావో లెక్కా... వైసీపీ కీల‌క నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

By:  Tupaki Desk   |   21 Dec 2022 3:30 AM GMT
అధినేత‌పైనే అన్ని కేసులు.. మావో లెక్కా...  వైసీపీ కీల‌క నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఒక విష‌యం హ‌ల్చ‌ల్ చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసేవారికి సంబంధించి ఇటీవ‌ల సుప్రీం కోర్టు సంచ‌ల‌న ఆదేశాలు ఇచ్చింది. నేత‌ల‌పై న‌మోదైన క్రిమిన‌ల్ కేసుల‌కు సంబం ధించి ప్ర‌త్యేకంగా అఫిడ‌విట్ తీసుకోవాల‌ని.. నేర స్వ‌భావాన్ని బ‌ట్టి వారు పోటీ చేయ‌డానికి అర్హులో కాదో తేల్చాల‌ని.. ఎన్నిక‌ల సంఘానికి సూచించింది. ఇప్పుడు ఈ విష‌యం.. నెల్లూరుకు చెందిన కీల‌క నాయ‌కుడు, మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ అనుచ‌రుల్లోచ‌ర్చ‌కు వ‌చ్చింది.

ఇటీవ‌ల ఆయ‌న‌పై కోర్టులో ప‌త్రాల దొంగ‌తనానికి సంబంధించి కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. గ‌తంలో టీడీపీ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి కాకానిపై చేసిన ప‌రువున‌ష్టం దావాకు సంబంధించిన ప‌త్రాలు కోర్టు కార్యాల‌యం నుంచి చోరీకి గుర‌య్యాయి. వీటికి సంబంధించి ఆయ‌న‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని ఇటీవ‌ల హైకోర్టు ఆదేశించ‌డంతో పోలీసులు విధిలేని ప‌రిస్థితిలో ఆ ప‌నిచేశారు.

అయితే.. ఇప్పుడు ఆయ‌న ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఇవి అడ్డంకిగా మారుతాయ‌నేది ప్ర‌తిప‌క్షాల మాట‌. ఇదే విష‌యాన్ని ఆయ‌న అనుచ‌రులు కూడా చ‌ర్చించుకుంటున్నారు. మా నాయ‌కుడు.. కూడా అఫిడ‌విట్ ఇవ్వాల్సివ‌స్తే.. ఆయ‌న‌ను కూడా ప‌క్క‌న పెడ‌తారా ? అనేది వీరి ఆవేద‌న‌, ఆందోళ‌న కూడా. అయితే.. దీనిపై మంత్రి అనుచ‌రుల్లో జిల్లా స్థాయిలో ఉన్న కీల‌క నేత ఒక‌రు ఆస‌క్తిగా వ్యాఖ్యానించారు.

సీఎం జ‌గ‌న్‌పైనే అనేక కేసులు ఉన్నాయి. ఇవి ఉండ‌గా.. మ‌న నాయ‌కుడిపై పెట్టిన కేసులు ఎంత ? ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. ఎందుకంటే.. నాయ‌కులు ఎవ‌రూ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా జ‌గ‌న్ గురించి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. అయితే.. ఈయ‌న ఇలా వ్యాఖ్యానించ‌డం.. ఇవి అధిష్టానం వ‌ర‌కు చేర‌డంతో మంత్రిని వివ‌ర‌ణ కోరే అవ‌కాశం ఉంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి దీనిపై మంత్రి కాకాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.