Begin typing your search above and press return to search.
మంత్రి అయ్యాక మీ అంతు చూస్తా ... ఆఫీసర్లని బెదిరిస్తున్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే !
By: Tupaki Desk | 23 March 2020 7:20 AM GMTఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి , శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ..ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎంతగా ప్రయత్నం చేస్తున్నారో ..అంతకి రెండింతలు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వాధికారులనే బెదిరిస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చింది మొదలు ..ప్రజా సంక్షేమమే ద్యేయంగా , లోటు బడ్జెట్ తో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉరకలు పెట్టిస్తున్న సీఎం జగన్ కి, సొంతపార్టీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి కొంచెం ఇబ్బందిగా మారింది.
గత కొన్ని రోజులుగా వైసీపీకి చెందిన ఒక మహిళా ఎమ్మెల్యే ఆగడాలకు అంతులేదు అని తెలుస్తుంది. ప్రతి రోజు ఉదయం ఆ మహిళా వైసీపీ ఎమ్మెల్యే దర్శనం చేసుకోవడానికే నియోజకవర్గానికి చెందిన ఆఫీసర్లని , ఉదయం 9 గంటలకి ఆమె తన ఇంటికి రమ్మని పిలుస్తుందట, ఆ తరువాత 9 :30 కి ఆమె ఒకసారి బయటకి వచ్చి అందరికి ఒకసారి హాయ్ చెప్పి, మళ్లీ లోపలి వెళ్తుందట, ఆ తరువాత 11 :30 కి వచ్చి ఎదో మీటింగ్ అని చెప్పి అందరిని టేబుల్ కి ఇరువైపులా కూర్చోబెట్టి..అసలు మీటింగ్ ఎందుకు పెట్టారో చెప్పకుండా కేవలం ప్రమోషన్స్ కోసం వీడియోలు, ఫోటోలు తీపిస్తుందట.
ఆ తరువాత ఈ ఉత్తిత్తి మీటింగ్ ఫోటోలని సోషల్ మీడియా సంస్థలైన పేస్ బుక్ , ట్విట్టర్ లో డబ్బులు ఇచ్చి మరి ప్రమోషన్ చేపిస్తుందట.. ప్రమోషన్ అంటే అలాంటి , ఇలాంటి ప్రమోషన్ కాదు. ఈ మద్యే ఎమ్మెల్యేల పనితీరుపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక సర్వే చేపిస్తే ..ఆ సర్వే లో సీఎం జగన్ కంటే ఈ మహిళా ఎమ్మెల్యే కే ఎక్కువ మార్కులు వచ్చాయంటే అర్థం చేసుకోండి ..ఈ ఎమ్మెల్యే ప్రమోషన్ ఏ రేంజ్ లో ఉందొ. ఎమ్మెల్యే లలో నేనే నెంబర్ వన్ అని డబ్బులు పెట్టి మరీ ప్రమోషన్ చేపిస్తుందని టాక్. ఇటీవలే ఆమహిళా ఎమ్మెల్యే సోషల్ మీడియా టీమ్ .. మా మేడం రాష్ట్రంలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యే , త్వరలోనే జగన్ కాబినెట్ లో మంత్రిగా భాద్యతలు తీసుకోబోతుంది అని విపరీతంగా ప్రమోషన్ చేస్తుందట..
మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన ఆ మహిళా ఎమ్మెల్యే , అదే నిజయోజకవర్గానికి చెందిన మాజీ సీనియర్ ఎమ్మెల్యేని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది అని , అలాగే ఆ జిల్లా ఎంపీ ని కూడా నియోజకవర్గం లో అడుగుపెట్టనీయకుండా అయన పై దాడి చేపించారు అని, ఆ ఎమ్మెల్యే మీద ఎంపీ గుర్రుగా ఉన్నారు. ఈ విషయం సీఎం జగన్ వద్దకి కూడా ఆ ఎంపీ తీసుకుపోయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అలాగే ఇటీవల ఒక మంత్రి వస్తే ..ఆ నియోజకవర్గ ఆఫీసర్లు , సీనియర్ వైసీపీ నేతలు ,,ఆ ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసారు. దీనితో ఈ ఫిర్యాదు గురించి తెలుసుకున్న ఆ మహిళా ఎమ్మెల్యే ..అలా తన పై మంత్రికి ఫిర్యాదు చేసిన వారందరిని పిలిచి ,,త్వరలో నేను మంత్రిని కాబోతున్న ,మంత్రిని అయ్యాక మీ అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిందట. ఎమ్మెల్యే ల సర్వే లో నేనే నెంబర్ వన్ ఎమ్మెల్యే అంటూ వారిని బెదిరించింది అని ఆ నియోజకవర్గంలో టాక్.
కాగా, సీఎం జగన్ మాత్రం హంగు , ఆర్భాటాలకు పోకుండా , రాష్ట్రం ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్ని ప్రణాళికల ప్రకారం జరిగేలా చూస్తుంటే ..ప్రభుత్వ ఎమ్మెల్యేలు సీఎంకు మద్దతుగా నిలిచేది పోనిచ్చి , ఈ విధంగా సోషల్ మీడియా లో పెయిడ్ ప్రమోషన్ చేపించుకోవడం ఏ మాత్రం సబబు కాదు. పెయిడ్ ప్రమోషన్ కి పెట్టిన ఖర్చు , ఆ నియోజకవర్గంలో ఏదైనా ఒక సమస్యని తీరడానికి ఉపయోగించింటే..ప్రజల్లో ఆదరణ అదే వచ్చిండేది. అధికారంలోకి రాకముందు జగన్ ..అన్ని వదిలి పేదల కోసం, వారి సమస్యలని తెలుసుకోవడానికి పాదయాత్ర చేసాడు కాబట్టే ఆయనకి ప్రజలు బ్రహ్మరధం పట్టారు ..అది పెయిడ్ ప్రమోషన్ వల్ల రాలేదు. పెయిడ్ ప్రమోషన్ వల్ల వచ్చే అభిమానం ఈ రోజు ఉంటుంది , రేపు పోతుంది కానీ , నిజమైన అభిమానం మాత్రం ఎప్పటికి దూరం అవ్వదు అని గుర్తించి ..ఇకనైనా నేను సర్వేలో నెంబర్ వన్ ఎమ్మెల్యే అని , మంత్రి ని అయ్యాక మీ అంతు చూస్తా అని అధికారులని బెదిరించడం మాని, చక్కగా నిత్యం నియోజకవర్గప్రజలకి అందుబాటులో ఉంటూ , వారికి అవసరమైన, నాలుగు మంచి పనులని చేస్తే ...అప్పుడు అన్ని ఆమె అనుకున్నట్టే జరుగుతాయి.