Begin typing your search above and press return to search.

ద్వివేదీ సంచ‌ల‌నం!..చంద్ర‌గిరిలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ!

By:  Tupaki Desk   |   17 May 2019 4:37 PM GMT
ద్వివేదీ సంచ‌ల‌నం!..చంద్ర‌గిరిలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ!
X
టీడీపీ అధినేత‌ - ఏపీ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు సొంత (జ‌న్మ‌స్థలం) నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరిలో రీపోలింగ్ రాజ‌కీయ తుఫానునే రేపింద‌ని చెప్పాలి. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎప్పుడో వ‌దిలేసిన చంద్ర‌బాబు... అక్క‌డ త‌న పార్టీ త‌ర‌ఫున ఎవ‌రినో ఒక‌రిని పోటీకి దింపుతూ తాను మాత్రం సేఫ్ జోన్ అయిన కుప్పంలో స్థిర‌ప‌డిపోయారు. మొత్తంగా చంద్ర‌బాబు ఎంత‌గా వ‌దిలేసినా... చంద్ర‌గిరి ఆయ‌న పుట్టినిల్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గ‌మే క‌దా. ఈ కార‌ణం గానే అక్క‌డ ఏ చిన్న ఘ‌ట‌న జ‌రిగినా కూడా టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉన్న ఊళ్ల‌లో ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌ను అస‌లు పోలింగ్ కేంద్రాల‌కే రాకుండా చేశార‌ట‌. ఈ క్ర‌మంలో అందుకు సంబంధించిన ప‌క్కా ఆధారాల‌ను సేక‌రించిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి... రీ పోలింగ్ కు విజ్ఞ‌ప్తి చేశారు.

చెవిరెడ్డి త‌న విజ్ఞ‌ప్తితో అంద‌జేసిన వీడియో క్లిప్పింగ్ లు చూసిన ఈసీ షాక్ తిన్న‌ద‌ట. ప్ర‌జ‌ల ఓటు హ‌క్కునే హ‌రించేలా టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రించార‌ని నిర్ధారించుకున్న ఈసీ... చంద్ర‌గిరిలోని ఐదు చోట్ల రీ పోలింగ్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలో టీడీపీ నేత‌లు ఈసీ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. ఏంత మేర సాధ్య‌మైతే... అంత‌మేర ర‌చ్చ చేస్తున్నారు. ఈసీ తీరును దునుమాడుతున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు అక్క‌డ పోలింగ్ సంద‌ర్భంగా ఏం జరిగింది? ఎందుకు తాము రీ పోలింగ్ కు సిఫార‌సు చేసిన విష‌యాల‌ను రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి గోపాల కృష్ణ ద్వివేదీ చాలా స్ప‌ష్టంగానే వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారాయి. ఓ రాజ‌కీయ నేత మాట్లాడిన తీరుగా మాట్లాడిన ద్వివేది... అక్క‌డి జ‌రిగిన తీరుపై తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేశారు.

అయినా ద్వివేదీ ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... చంద్ర‌గిరి పోలింగ్ స‌మ‌యంలో వీడియో చూస్తే అస‌లు ప్ర‌జాస్వామ్యంలో ఇలా ఉంటుందా? అనే బాధ క‌లిగింద‌ని ద్వివేదీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ కార‌ణంగానే అక్క‌డ ఖ‌చ్చితంగా రీపోలింగ్ అస‌వ‌రం అని తాము భావించామ‌ని చెప్పారు. ఓటర్ల‌ను అడ్డుకునేందుకు రాజ‌కీయ పార్టీల‌కు స‌హ‌క‌రించిన అధికారుల పైనా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న‌ హెచ్చ‌రించారు. ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయ్యేలా అక్క‌డ పోలింగ్ జ‌రిగిన తీరును ప‌రిశీలించిన త‌రువాత‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి రీపోలింగ్ కు సిఫార్సు చేసామ‌ని చెప్పిన ఆయ‌న‌... అందుకు సంబంధించిన ఆధారాలు పంపామ‌ని వివ‌రించారు. వాటిని అధ్య‌య‌నం చేసిన త‌రువాత‌నే కేంద్ర ఎన్నిక‌ల సంఘం రీ పోలింగ్ నిర్ణ‌యం తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తంగా పోలింగ్ సంద‌ర్భంగా చంద్ర‌గిరిలో ఏం జ‌రిగింద‌న్న తీరును ద్వివేదీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగానే చెప్పార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.