Begin typing your search above and press return to search.
మండలిలో డొక్కాతో వైసీపీ బోణీ
By: Tupaki Desk | 25 Jun 2020 6:45 AM GMTశాసనసభలో 151మంది ఎమ్మెల్యేలతో అన్ని బిల్లులను ఈజీగా నెగ్గించుకుంటున్న జగన్ సర్కార్ కు శాసనమండలి మాత్రం బ్రేక్ వేస్తోంది. అక్కడ ప్రతిపక్ష టీడీపీ ప్రాబల్యంతో బిల్లులు ఆగిపోతున్నాయి. ఈ క్రమంలో శాసనమండలిలో తొలి బలాన్ని పెంచుకునే దిశగా వైసీపీ తొలి అడుగులు వేసింది.
శాసనమండలిలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. వైసీపీ అభ్యర్థిగా డొక్కా మణిక్య వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ పార్టీ అస్సలు పోటీనే చేయడం లేదు. ఆ పార్టీకి తగిన బలం లేకపోవడమే దీనికి కారణం. ఎవరూ నామినేషన్ వేయడంతో డొక్కా ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయం. మండలిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలి భోణీ కొట్టబోతోంది.
డొక్కా మణిక్య వరప్రసాద్ టీడీపీలో నుంచి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని జగన్ ఆయనతోనే భర్తీ చేస్తున్నారు. టీడీపీకి బలం లేకపోవడంతో డొక్కా ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
కాగా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీచేసి డొక్కా ఓడిపోయాడు. అనంతరం వైసీపీ లో చేరారు.