Begin typing your search above and press return to search.

40 ఏళ్ల అనుభ‌వం స‌రే..సంస్కారం ఏది బాబూ?

By:  Tupaki Desk   |   27 Oct 2018 8:11 AM GMT
40 ఏళ్ల అనుభ‌వం స‌రే..సంస్కారం ఏది బాబూ?
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ - వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ పై జ‌రిగిన హ‌త్యాయ‌త్న దాడి ఘ‌ట‌న‌న‌ను ప‌లువురు ఖండించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ పై దాడి ఘ‌ట‌న విష‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు వైఖ‌రి - వ్యాఖ్య‌ల‌పై పెనుదుమారం రేగుతోంది. సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబు...జ‌గ‌న్ పై దాడి విష‌యంలో నిర్ల‌క్ష్య పూరితంగా మాట్లాడ‌డం పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా వైసీపీ నేత గుడివాడ అమర్‌ నాథ్‌.....చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. జగన్ పై హత్యాయత్నానికి కర్త - కర్మ - క్రియ చంద్రబాబేనని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని డ‌ప్పు కొట్టుకునే చంద్రబాబు ఈ విధంగా మాట్లాడ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్రశ్నించారు. చంద్రబాబు కనీస మర్యాద లేని మ‌నిష‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దాడి ఘటనను ఖండించకుండా - జగన్ ను పరామర్శించకుండా చంద్ర‌బాబు అమానుషంగా ప్రవర్తించారని దుయ్య‌బ‌ట్టారు. ఎయిర్‌ పోర్టులో భద్రత కేంద్ర పరిధిలోద‌ని చెప్పి చేతులు దులుపుకున్న చంద్రబాబుకు సంస్కారం లేదన్నారు

గ‌తంలో జ‌గన్‌ విశాఖ ఎయిర్‌ పోర్టుకు వచ్చిన స‌మ‌యంలో ఆయనకు తామే టీ - స్నాక్స్‌ అందించేవార‌మ‌ని - క్యాంటీన్‌ నిర్వాకుడు - టీడీపీకి చెందిన హర్షవర్థన్‌ దీనికి అభ్యంతరం తెలిపార‌ని అన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ కు టీ అందించే వంక‌తో శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడని అన్నారు.పనీ పాట లేని ఓ ఆర్టిస్ట్‌ ‘ఆపరేషన్‌ గరుడ’ అని చెప్ప‌గానే సీఎం నిజ‌మ‌ని న‌మ్మి అనుమానాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ఆపరేషన్‌ గరుడ’పై బాబు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయ‌న ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటలిజెన్స్‌ పని చేయడం లేదా అని ప్ర‌శ్నించారు. ఆ దాడి ఘ‌ట‌న‌పై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మాత్రమే కోరామని, పక్క రాష్ట్ర పోలీసులతో విచారణ చేయించాల్సిందా కోర‌లేద‌న్నారు. ఘ‌ట‌న జ‌రిగిన కొద్ది సేప‌టికే డీజీపీ....నిందితుడు శ్రీ‌నివాస్ వైసీపీ కార్య‌క‌ర్త అని స్టేట్ మెంట్ ఎలా ఇచ్చార‌ని అమ‌ర్ నాథ్ ప్ర‌శ్నించారు.