Begin typing your search above and press return to search.
దమ్ముంటే జగన్ సవాలును స్వీకరించు బాబు: ఐవీరెడ్డి
By: Tupaki Desk | 8 Nov 2017 4:29 PM GMTవిశ్వసనీయతకు కేరాఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబం. చెప్పిన మాట మీద నిలబడే తత్త్వం వైఎస్‌కుటుంబానికి.. అందుకు పూర్తి భిన్నం చంద్రబాబుది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే దమ్ము దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని వ్యాఖ్యానించారు ఆ పార్టీ గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి.
ఎన్నివేళ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చని చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. విదేశాల్లో తన ఆస్తులకు సంబంధించి ఒక్క రూపాయి చూపించినా.. రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని జగన్ సవాలు చేశారన్న ఐవీ రెడ్డి.. దమ్ముంటే జగన్ సవాల్‌ను స్వీకరించే సత్తా చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు.
2014 ఎన్నికల వేళ 600 మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. నాటి వైఎస్ ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్యశ్రీ.. ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర పథకాలకు ప్రజల్లో చక్కటి ఆదరణ ఉందని.. బాబు అధికారంలోకి వచ్చాక ఆ పథకాల్ని నిర్వీర్యం చేశారన్నారు.
తరచూ విదేశాలకు వెళ్లే చంద్రబాబు.. తన విదేశీ పర్యటనలో వేలాది కోట్లు పెట్టుబడులుగా తెస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారన్న ఐవీ రెడ్డి.. గడిచిన మూడున్నరేళ్ల వ్యవధిలో ఒక్కటంటే ఒక్క విదేశీ కంపెనీ అయినా ఏపీకి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పన విషయంలో బాబు మోసపూరిత హామీని ఇచ్చారన్నారు. ఏపీలో బాబు పాలన దారుణంగా ఉందని.. అనైతికతతో పార్టీ ఫిరాయింపులకు తెర తీస్తున్నారని తప్పు పట్టారు. జగన్ చేసిన ఛాలెంజ్‌కు బాబు స్పందించాలని డిమాండ్ చేశారు.