Begin typing your search above and press return to search.
అర్ధరాత్రి అరెస్టులు అన్యాయం : ఐవి రెడ్డి
By: Tupaki Desk | 9 Sep 2016 6:48 PM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించడానికి ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేలా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్‌ను భగ్నం చేయడానికి కుట్ర పన్నిన ప్రభుత్వం.. వైకాపా నాయకులను శుక్రవారం అర్ధరాత్రి నుంచే పాశవికంగా అరెస్టులు చేయడం అన్యాయం అని గిద్దలూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఐవి రెడ్డి అన్నారు. కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వకుండా చేసిన వంచన పట్ల,.. ప్యాకేజీ అనే దారుణమైన వంచనను స్వాగతిస్తున్నాం.. అభినందిస్తున్నాం అంటూ.. రాష్ట్ర ప్రయోజనాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న ద్రోహం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
హోదా సాధన కోసం రాష్ట్ర బంద్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. ప్రజల మద్దతు కూడా దీనికి వెల్లువెత్తుతుండడంతో.. సహించలేకపోయిన రాష్ట్ర ప్రభుత్వం అరాచకంగా వైకాపా నాయకులను అర్ధరాత్రినుంచి అరెస్టులు చేస్తున్నదిన ఐవి రెడ్డి ఆరోపించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి చేతనైతే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించుకు రావాలని.. అంతే తప్ప.. ప్రజల కోసం ఉద్యమిస్తున్న వారిని అరెస్టులు చేయడం.. గర్హనీయమని ఆయన పేర్కొన్నారు.