Begin typing your search above and press return to search.
నందమూరి కుటుంబం మౌనమెందుకు.?
By: Tupaki Desk | 28 Nov 2018 11:36 AM GMTకాంగ్రెస్-టీడీపీ అనైతిక పొత్తుపై వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. విజయవాడలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెడితే.. చంద్రబాబు మాత్రం సోనియా - రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. నాలుగేళ్లు మోడీ చంకనెక్కి - బీజేపీతో అంటకాగిన చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మండిపడ్డారు.
ఇక చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల గురించి ఎన్టీఆర్ అప్పట్లో చెప్పింది అక్షరాలా నిజమవుతోందని జోగి రమేష్ స్పష్టం చేశారు. నందమూరి కుటుంబం ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉందో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీకి వ్యతిరేకంగా పోరాడుతోందని వైఎస్ జగన్ మాత్రమేనని పునరుద్ఘాటించారు.
చంద్రబాబు - రాహుల్ గాంధీ కలిసి కుట్రతో వైఎస్ జగన్ పై కేసులు పెట్టించారని వైసీపీ నాయకులు మల్లాది విష్ణు మండిపడ్డారు. బ్యాంకులు దోచిన టీడీపీ నేతలతో కలిసి రాహుల్ ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. సిగ్గులేకుండా ఇద్దరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని.. జగన్ డిక్షనరీలోనే భయం లేదని మల్లాది విష్ణు తెలిపారు. జగన్ పై అవాకులు - చెవాకులు పేలడం మానుకోవాలని హితవు పలికారు.