Begin typing your search above and press return to search.
లోకేష్ కాళ్ల దగ్గర టీడీపీ నేతలు
By: Tupaki Desk | 18 May 2016 11:22 AM GMTప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లోనూ వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఇప్పటికే.. రాష్ట్ర రాజకీయాల్లో రెండో నెంబరు అయిపోయారు! ఇక రేపో మాపో ఆయనే సీఎం అభ్యర్థి అయిపోయినట్టే! ఇక ఏపీలో ఇంకా ఆ పరిస్థితి వచ్చే అవకాశాలు లేవు! 2019 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తే.. అప్పుడు నాయకత్వ మార్పుపై చర్చ జరగవచ్చు. అయితే ఇప్పుడు ఏపీలో టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు తనయుడు లోకేష్ మంత్రం జపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. రేపోమాపో ఈ ప్రక్రియ జరగవచ్చు. అందుకే నాయకులంతా లోకేష్ చుట్టూ చేరి.. ఆయన ఆశీస్సులు పొందేందుకు తెగ ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం దీనిని ఆధారంగా చేసుకుని.. వైకాపా నేతలు విమర్శిస్తున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆయన కుమారుడుగా జగన్ ఎన్నడూ రాజకీయాల్లోగానీ, పాలనలోకాని జోక్యం చేసుకోలేదని, అదే చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆయన కుమారుడు లోకేష్ కాళ్లవద్ద ఎమ్మెల్యేలు పడి ఉంటున్నారని వైకాపా ఎమ్మెల్యే - చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.నారాయణస్వామి విమర్శించారు. కానీ జగన్ పై టీడీపీ నేతలు లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
జగన్ కర్నూలులో జలదీక్షలో ఆయన మాట్లాడుతూ జగన్ రాయలసీమ సింహమని - ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి పార్టీ పెట్టుకుని ఆత్మగౌరవం నిలబెట్టుకున్నారని అన్నారు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి రేయింబవళ్లు కృషి చేశారని, అప్పట్లో చంద్రబాబును వెన్నుపోటు నేత అని విమర్శించిన వారే ఇప్పుడు ఆయన చెంత చేరారని నారాయణస్వామి విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వారికి చీము - నెత్తురు లేవని అవి ఉంటే వారు రాజీనామా చేసి ఉండేవారని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని, అంతవరకు మనం పోరాటం చేయాలని నారాయణ స్వామి పిలుపు ఇచ్చారు.