Begin typing your search above and press return to search.
జగన్ పార్టీ నేత హత్య..పరిటాల ఫ్యామిలీ హస్తం?
By: Tupaki Desk | 10 Oct 2018 10:18 AM GMTఅనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. మాజీ సర్పంచ్ కేశవరెడ్డి ఈ రోజు దారుణ హత్యకు గురయ్యారు. ఆత్మకూరుకు చెందిన కేశవరెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తం హత్య చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
పక్కా ప్లాన్ తోనే కేశవరెడ్డిని దారుణంగా హత్య చేసినట్లుగా సమాచారం. మూకుమ్ముడిగా రాడ్ లతో దాడి చేసి హతమార్చినట్లుగా తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ఉన్న ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లుగా తెలిసింది.
పరిటాల కుటుంటానికి.. కేశవరెడ్డికి మధ్యన పాత కక్షలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. కేశవరెడ్డి హత్య వెనుక పరిటాల కుటుంబ హస్తం ఉందన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. పాత కక్షల్ని మనసులో ఉంచుకొనే హత్య చేసి ఉంటారని చెబుతున్నారు. ఈ హత్య ఉదంతంలో ఏపీ మంత్రి పరిటాల సునీత సోదరుడి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే కేశరెడ్డి హత్యపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అధికార బలాన్ని చూసుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్‌నేతలు మండిపడుతున్నారు. తన భర్త హత్య వైనంపై కేశవరెడ్డి సతీమణి రాజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.