Begin typing your search above and press return to search.
టీడీపీలోకి పులివెందుల చైర్మన్?!
By: Tupaki Desk | 26 Jan 2017 6:48 AM GMTఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు సంబంధించి తారాస్థాయికి చేర్చిన వార్త ఇది. కడప జిల్లా పులివెందుల మున్సిపల్ చైర్మన్ ప్రమీలమ్మ వైఎస్సార్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు వార్తలు వెలువడుతున్నాయి. జగన్ పినతండ్రి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్ వైఎస్ మనోహర్ రెడ్డి తన భార్య, మున్సిపల్ చైర్మన్ ప్రమీలమ్మ, మరికొంత మంది అనుచరులతో కలిసి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ సమక్షంలో విజయవాడలో పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో విభేదాలు తలెత్తడంతో గత కొంతకాలంగా మనోహర్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకూ దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు కుటుంబపరంగా ఆర్థిక లావాదేవీలు తలెత్తడం, జగన్ వ్యవహార శైలితో విభేదించిన మనోహర్ రెడ్డి భవిష్యత్ రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దుపోకడలతో విసిగివేశారిన మనోహర్ రెడ్డి తమ అనుచరులతో మంతనాలు జరిపి పార్టీ వీడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ కుటుంబంలో చీలిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల గండికోట రిజర్వాయర్ నుంచి పులివెందులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీరు వదలడంతో పులివెందులవాసుల్లో టీడీపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. దీంతో పులివెందులలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. తెలుగుదేశంలో చేరడం ద్వారా ప్రజలకు చేరువకావచ్చని, తద్వారా వచ్చే ఎన్నికల్లో తిరిగి పోటీకి అవకాశం లభిస్తుందన్న ఆశతో మనోహన్‌రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మనోహర్‌రెడ్డి తెలుగుదేశంలో చేరితే అది కడప జిల్లాలో వైకాపాకు, జగన్‌కు గట్టిదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/