Begin typing your search above and press return to search.
పిల్ల కాంగ్రెస్ కు తల్లి కాంగ్రెస్ వాసనలు పోలేదే?
By: Tupaki Desk | 12 March 2016 11:32 PM ISTఏమైనా ఒకే తానులో గుడ్డలు కదా.. తల్లి.. పిల్ల కాంగ్రెస్ నేతల ఆలోచనలన్నీ ఒకే రకంగా ఉంటాయన్న విషయం మరోసారి రుజువైంది. ఈ మధ్యన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు మాట్లాడుతూ.. 2018 వరకు నిద్రపోతామని.. ఆ తర్వాత నిద్ర లేచి బెబ్బులిగా విరుచుకుపడి.. తెలంగాణ అధికారపక్షాన్ని ఓడిస్తామని చెప్పటం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదిలా ఉంటే.. తల్లి కాంగ్రెస్ పార్టీ నేతల మాదిరే తాజాగా వ్యాఖ్యలు చేశారు పిల్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించటం ఖాయమని.. ఇందుకోసం తాము ఏమీ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ‘‘మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా ఉంటే చాలు. ప్రజల ఆదరణ లభించటం ఖాయం. చంద్రబాబు వ్యవహారశైలి.. ప్రభుత్వ తీరుతో అందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను గుర్తు చేసుకుంటారు. వైఎస్ కుమారుడు జగన్ అధికారంలోకి వచ్చి ప్రజారంజకంగా పాలన చేస్తారని అనుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. విపక్షంగా ఉండి తాము నిర్వర్తించాల్సిన ధర్మాన్ని నిర్వర్తించకున్నా ప్రజలు అధికారాన్ని అప్పచెబుతారంటూ మేకపాటికి అంత నమ్మకం ఎందుకో?
వైఎస్ కానీ ఇదే తీరులో ఆలోచించి.. పాదయాత్రలు లాంటివి పక్కన పెట్టేసి.. మేకపాటి లాంటి వాళ్లు చెప్పినట్లుగా ఇంట్లో పడుకొని ఉంటే ఏం అయ్యేదో ఒక్కసారి ఊహించుకోండి. ఇంతకీ జగన్ ను ఏం చేయాలన్నది మేకపాటి ఆలోచన..? ఒకే సమయంలో తల్లి.. పిల్ల కాంగ్రెస్ నేతలకు ఒకేలాంటి ఆలోచనలు రావటం గమనించారా?