Begin typing your search above and press return to search.
రాహుల్ కి.. బాబుకి లింకేట్టెశాడు
By: Tupaki Desk | 25 July 2015 5:23 AM GMTరాజకీయాల్లో విమర్శలు మామూలే అయినా.. మరీ వెనుకా ముందు చూసుకోకుండా లింకులు పెట్టేయటం చాలా అరుదు. అలాంటి పనినే చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి. చేసే విమర్శ ఒకరికి కాకపోతే.. ఒకరినైనా ఆకర్షించేలా ఉండాలి. అంతేకానీ.. నవ్విపోయేలా ఉండకూడదు. తాజాగా పార్థసారధి వ్యాఖ్య ఇదే రీతిలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంతకీ ఆయనంత కామెడీగా చేసిన వ్యాఖ్యలేమంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కోసమే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీలో పాదయాత్ర నిర్వహించారని జోకేశారు. రాహుల్ పర్యటన మొత్తం.. చంద్రబాబు డైరెక్షన్ లోనే సాగినట్లుగా వ్యాఖ్యలు చేశారు.
పట్టిసీమ.. ఓటుకు నోటు.. పుష్కర తొక్కిసలాట మొదలైన విషయాలపై రాహుల్ మాట్లాడలేదని వ్యాఖ్యానించిన పార్థసారధి.. ఏపీ ప్రత్యేకహోదా విషయంలో రాహుల్ మాటలే తప్ప చేతలు చూపించలేదన్న వ్యాఖ్యను మాత్రం చేయకపోవటం గమనార్హం. తిట్టాలన్న లక్ష్యమే తప్పించి.. తాను మాట్లాడే మాటల్లో విషయం ఏమైనా ఉందా? అన్నది కూడా పట్టించుకోకుండా మాట్లాడేసినట్లుగా పార్థసారధి మాటలు ఉండటం గమనార్హం. మొత్తానికి రాహుల్ కు చంద్రబాబుకు లింకు పెట్టేసిన ఘనత మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్థసారధికే దక్కిందని చెప్పక తప్పదు.