Begin typing your search above and press return to search.
అలా చేస్తే బాబు టీంను తరిమికొడతారట
By: Tupaki Desk | 21 Jun 2017 5:43 PM GMTలక్షలాది మంది లబ్ధిదారులకు మోసం చేసేలా ఏపీ సర్కారు వ్యవహరించడం సరికాదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టిన మోసపోయిన వారికి అగ్రిగోల్డ్ ఆస్తులు పంచడం ద్వారా న్యాయం చేయాల్సి ఉండగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని సర్కారు అన్యాయం చేసే రీతిలో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కారుచౌకగా కొట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక - మట్టి - భూములు దోచుకున్నట్టు అగ్రిగోల్డ్ భూములను దోచుకుంటే చంద్రబాబు సర్కార్ ను ప్రజలు తరిమికొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్దసారది తాజాగా మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ అంశం 40 లక్షల కుటుంబాలకు సంబంధించిన సమస్య అని అన్నారు. `ప్రజలకు ఇవ్వాల్సిన అఫ్పులకంటే సంస్థ ఆస్తుల విలువే ఎక్కువగా ఉంది, మీ డబ్బులకు ఏ ఢోకా లేదు`అని చెప్పిన ప్రభుత్వం....ఆ భూములను ఏవిధంగా దోచుకోవాలా అని ప్లాన్ చేయడం దారుణమన్నారు. విజయవాడ దగ్గర ఉన్న 25 ఎకరాల భూమిని ఈటెండర్ ద్వారా కేవలం ఐదుకోట్లకే ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నష్టపోయిన వారు 30 కోట్లు ఇస్తామంటే నిబంధనలు ఒప్పకోవని ఇవ్వలేదని, ఆ తర్వాత హైకోర్టు రెండో సారి ఆక్షన్ పెడితే అదే భూములను రూ.11 కోట్లకు పాడారన్నారు. బాధితులకు నష్టం జరుగుతున్నా నివారణకు ప్రయత్నించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద లాట్స్ ఆక్షన్ కు పెడితే పెద్దమొత్తంలో కొనడానికి ఎవరూ ముందుకురారని పార్థసారధి అన్నారు.
అగ్రిగోల్డ్ భూములను బహిరంగ వేలం వేయాలని పార్థసారధి డిమాండ్ చేశారు. ఇన్వెస్టర్లు కుమ్మక్కై పంచుకునే విధంగా అన్యాయం జరిగే పరిస్థితులొస్తున్నందున పెద్ద పెద్ద భూములను ఆక్షన్ చేయాలని పార్థసారధి సూచించారు. వాటిని చిన్న చిన్న ప్లాట్స్ చేసి అమ్మితే చాలామంది లాభపడతారని చెప్పారు. అంతేగానీ, కుట్రపూరితంగా మీకు కావాల్సిన వారికి ఆస్తులు కట్టబెడితే ప్రజలు క్షమించరున్నారు. నెల్లూరు, ఒంగోలు లాంటి పట్టణాల్లో గజం రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు పలుకుతోందని, చిత్తశుద్ధితో మార్కెట్ ధరకు పోయేలా వారిని కాపాడాలన్నారు. బాధితులకు మేలు చేసే ఆలోచనలు చేయకుండా... ప్రభుత్వం దోబూచులాడుతూ దొంగ ఆలోచనలు చేస్తోందని పార్థసారధి ఆగ్రహించారు. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/