Begin typing your search above and press return to search.

చంద్రబాబు – పవన్‌ భేటీపై వైసీపీ ముఖ్య నేత సజ్జల సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   9 Jan 2023 10:34 AM GMT
చంద్రబాబు – పవన్‌ భేటీపై వైసీపీ ముఖ్య నేత సజ్జల సంచలన వ్యాఖ్యలు!
X
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌ లో చంద్రబాబు నివాసంలో దాదాపు 2.30 గంటల పాటు చర్చలు జరిపిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. దీనిపై వైసీపీ నేతలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. పవన్‌ ప్యాకేజీ స్టార్‌ అని, సంక్రాంతి పండుగ ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి వెళ్లాడని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘాటు విమర్శలకు దిగారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ సమావేశంపై ప్రభుత్వ సలహాదారు, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా సమావేశం కావాల్సిన అవసరం లేదని, ఎందుకంటే.. ఇద్దరు కలిసే సంసారం చేస్తున్నారని మండిపడ్డారు. కథ, స్టోరీ, స్క్రీన్‌ ప్లే అన్నీ చంద్రబాబేనంటూ సజ్జల హాట్‌ కామెంట్స్‌ చేశారు. తమ అపవిత్ర కలయికకు పవిత్రత తీసుకువచ్చేందుకు వారిద్దరు సమావేశం అయ్యారని ఎద్దేవా చేవారు.

చంద్రబాబు చేసిన పనులను పవన్‌ ఖండించాలి కానీ, ఆ పని ఎప్పుడూ పవన్‌ కల్యాణ్‌ చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు సిద్ధాంతాలు ఏవి నచ్చి మద్దతు ఇస్తున్నారో పవన్‌ చెప్పాలని సజ్జల డిమాండ్‌ చేశారు.

అలాగే పవన్, చంద్రబాబు ఏం చర్చించారో ఎందుకు బయట పెట్టరు.. ? అని సజ్జల నిలదీశారు. సీట్లు, ఓట్లు గురించి మాట్లాడుకున్నారా? ప్యాకేజ్‌ గురించి చర్చించారా? అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన అనుమానాలు వ్యక్తం చేశారు. ఎవరెవరు కలిసి పోటీ చేస్తారోననే సందేహం త్వరగా తొలగిపోవాలనే తాము కోరుకుంటున్నామని సజ్జల హాట్‌ కామెంట్స్‌ చేశారు.

అంతా కలసి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని దింపి.. చంద్రబాబుని అధికారంలోకి కూర్చోబెట్టాలి అనే అజెండా పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పగటి వేషగాళ్లు వస్తున్నారు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఈ విషయాలన్ని అర్ధం అవ్వాలనే పవన్, బాబు మీటింగ్‌ పై ఇంత మంది వైసీపీ నాయకులు స్పందించాల్సి వచ్చిందని వెల్లడించారు.

టీడీపీ, జనసేన పొత్తు పై కూడా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ జగన్‌కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఐదేళ్ల కాలానికి తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు తాము సజీవంగా ఉన్నామని చెప్పటానికి ముందస్తు ఎన్నికలు ప్రకటనలు చేస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ఎందుకు సమావేశాలు జరుపుతున్నారు? తమ అక్రమ సంబంధాలను సక్రమం అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నారా? అని ఘాటు విమర్శలు చేశారు.

చంపినవాళ్లను పరామర్శించటం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? అని సజ్జల నిలదీశారు. 11 మంది ప్రాణాలు తీసిన చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ పరామర్శించటంపై తీవ్ర విమర్శలు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.