Begin typing your search above and press return to search.
మా ఆయన ఒక పార్టీలో.. నేను మరోపార్టీలో ఉండలేం.. వైసీపీ నేత సుచరిత సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 5 Jan 2023 9:10 AM GMTఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు, సీఎంగా జగన్‌ను చూడాలని కలలు కన్న మహిళా నేత.. వైఎస్ కుటుంబానికి ఎంతో కావాల్సిన మనిషిగా గుర్తింపు పొందిన మేకతోటి సుచరిత.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన మంత్రి వర్గం విస్తరణలో అప్పటి వరకు హోం మంత్రిగా ఉన్న సుచ రితను సీఎం జగన్ పక్కన పెట్టారు. అప్పట్లోనే ఆమె ధిక్కార స్వరం వినిపించారు.
పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఇంతలోనే ఏమైందో తెలియదుకానీ.. సర్దుకున్నా రు. అయినప్పటికీ.. ముభావంగానే ఉన్నారు ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట గుంటూరు వైసీపీ బాధ్య తల నుంచి తప్పుకొంటున్నట్టు రాజీనామా లేఖను మీడియాకు విడుదల చేశారు. ఇక, ఆ తర్వాత సైలెం ట్ అయిపోయిన సుచరిత.. మరోసారి ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. తాజాగా ఆమె గుంటూరు జిల్లా కాకుమా నులో మీడియాతో మాట్లాడారు.
"నేను.. నా భర్త ఇద్దరం వైసీపీలోనే ఉన్నాం. నా మాట నా భర్త దయాసాగర్(ఈయన ఐఆర్ ఎస్ అధికారి. ప్రస్తుతం కేంద్రం డిప్యుటేషన్‌పై తీసుకుని.. ఢిల్లీలో నియమించింది. దీనికి కూడా జగన్ కారణమనే వాద న కొన్నాళ్లు వినిపించింది) దాట వేయరు. అయితే.. నా భర్త రేపు మరోపార్టీలోకి వెళ్లాలని అంటే.. ఒక భార్య గా ఆయనను అనుసరించకతప్పదు.. నేనొక పార్టీ, నా భర్త మరోపార్టీలో మా పిల్లలు ఇంకో పార్టీలో ఉండ లేం కదా"అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. సుచరిత ఇప్పటికే తన దారి తాను చూసుకుంటున్నారన్న వాదనలకు బలా న్ని చేకూరుస్తోందని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి సుచరిత.. జనసేన వైపు చూస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే..
ఆమె జనసేనలోకి వెళ్లి మంత్రి పదవిని పొందాలనే ఆశతో ఉన్నారని అంటున్నారు. ఇక, భర్త దయాసాగర్.. సీఎం జగన్‌కు అనుకూలమే అయినా.. ఉద్యోగిగా ఆయన ఏ పార్టీని సమర్ధించే పరిస్థితి లేదు. కానీ, ఇప్పుడు ఆయనను బూచిగా చూపించి.. సుచరిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.