Begin typing your search above and press return to search.

జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం

By:  Tupaki Desk   |   10 Aug 2018 7:58 AM GMT
జగన్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం
X
గ‌త నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు అవినీతి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అర‌చేతిలో అమ‌రావ‌తి చూపిస్తోన్న చంద్రబాబు....లేని అభివృద్ధిని ఉన్న‌ట్లుగా చూపించ‌డంలో - గోబెల్స్ ప్ర‌చారం చేయ‌డంలో సిద్ధ‌హ‌స్తులు. ప‌నామా పేప‌ర్స్ త‌ర‌హాలో ....వంద‌ల కంపెనీల‌ను ఏపీకి తెప్పించిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. చంద్ర‌బాబుకు బాకా ఊదడానికి `ఎల్లో`మీడియా ప్ర‌త్యేకంగా ఎంత శ్ర‌ద్ధ‌వ‌హిస్తుందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎల్లో మీడియాకున్న ప్ర‌ధాన ఎజెండాలు రెండే...ఒక‌టి చంద్ర‌బాబును ఇంద్రుడూ...చంద్రుడూ....అని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డం....ఏ మాత్రం అవ‌కాశం దొరికినా....ప్ర‌తిప‌క్ష నేత - వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ పై బుర‌ద జ‌ల్ల‌డం. వేల ఎక‌రాల భూక‌బ్జాలు చేసినా....వేల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డా...చంద్ర‌బాబును ప‌ల్లెత్తు మాట అన‌ని ఎల్లో మీడియా....జ‌గ‌న్ పై చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా దుష్ప్ర‌చారం చేయ‌డం తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో ఎల్లో మీడియాపై ప్రజల్లో కూడా తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా, ఎల్లో మీడియాపై వైసీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు.

త‌మ నేత జ‌గ‌న్ కు నానాటికీ వ‌స్తోన్న ప్రజాదారణ చూసి టీడీపీ ప్రభుత్వం - ఎల్లో మీడియా మాట‌ల దాడికి దిగుతోందని విమర్శించారు. లేనిపోని ఆరోప‌ణ‌ల‌తో జ‌గ‌న్ పై బుర‌ద జ‌ల్ల‌డ‌మే ఎజెండాగా ఎల్లో మీడియా - చంద్ర‌బాబు ప‌ని చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. భారతి సిమెంట్స్‌లో పెట్టుబడుల అంశానికి సంబంధించి వైఎస్‌ భారతి పేరును ఈడీ చార్జిషీట్‌లో చేర్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. భార‌తి సిమెంట్స్ విష‌యంలో అంతా స‌వ్యంగా ఉన్న‌ప్ప‌టికీ....భారతి పేరును చార్జిషీట్‌ లో చేర్చ‌డం ఏమిట‌ని ప్రశ్నించారు. ఆ వ్య‌వ‌హారంలో చట్టబద్ధం కానిది ఏమిటో ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరక్టరేట్‌ చెప్పాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. అయినా, ఏడేళ్ల తర్వాత భారతి పేరును ఈడీ చార్జిషీట్‌ లో చేర్చడం గ‌మ‌నార్హ‌మ‌న్నారు. భారతీ సిమెంట్స్‌ మెజారిటీ వాటాను ఫ్రాన్స్‌ కంపెనీ వికా కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.

చార్జిషీట్ లో తన పేరున్న సంగ‌తి భార‌తి గారికి తెలియకముందే..ఎల్లో మీడియాలో దుష్ప్ర‌చారం మొద‌ల‌వ‌డం వెనుక టీడీపీ కుట్ర ఉంద‌న్నారు. ఉమాశంకర్‌ గౌడ్‌ - గాంధీ అనే అధికారులు....టీడీపీకి - ఎల్లో మీడియాకు లీకులిచ్చార‌ని మండిప‌డ్డారు.ఈ కేసును టీడీపీ అభిష్టానికి అనుగుణంగా బీజేపీ వాడుకుంటోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికార‌ని...ఆయ‌న ఆడియో టేపుల రిపోర్టు వ‌చ్చినా - సాక్ష్యాధారాలున్నా....చర్యలు ఎందుకు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ అగ్రనేతల‌తో బాబు ఇప్ప‌టికీ అంట‌కాగుతున్నార‌ని, ఆ రెండు పార్టీల‌కు చీక‌టి ఒప్పందం ఉంద‌న్నారు. త‌మ‌కు చంద‍్రబాబు శాశ్వత మిత్రుడు అని రాజ్‌ నాథ్ లోక్ స‌భ‌లో బాహాటంగానే వెల్ల‌డించార‌ని గుర్తు చేశారు. బీజేపీ-టీడీపీలు బెదిరింపు నాట‌కాలు ఆడుతున్నాయ‌న్నారు. బీజేపీ -కాంగ్రెస్‌ తో చంద్రబాబు ఒకే సారి కాపురం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. నాడు వైఎస్సార్ ను - నేడు జగన్‌ ను ఎదుర్కోలేక ఈ ర‌క‌మైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.ఏపీకి మొద‌ట కాంగ్రెస్ ద్రోహం చేసింద‌ని, త‌ర్వాత బీజేపీ చేసింద‌ని...ఇద్ద‌రికీ ఇంటి దొంగ టీడీపీ స‌హ‌క‌రించింద‌ని ఆరోపించారు. ఎన్టీఆర్‌ ఆశయాన్ని పాతేసి కాంగ్రెస్‌ తో కలుస్తారా అని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. ఎవ‌రెన్ని ఆరోపణలు చేసినా జగన్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు.