Begin typing your search above and press return to search.
సభలో జగన్ బ్యాచ్ బాబును రౌండ్ చేశారా?
By: Tupaki Desk | 18 Dec 2015 12:44 PM GMTఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న ఏపీ అసెంబ్లీలో అనూహ్య పరిణామాలు కొన్ని చోటు చేసుకున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి పలుమార్లు వాయిదాలు.. భారీ సస్పెన్షన్లతో పాటు.. అధికార.. విపక్షాల ఆవేశకావేశాలతో వ్యవహరించారు. ఇదిలా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అనుసరించిన వైఖరి వివాదాస్పదంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీటు వద్దకు 20 మంది జగన్ పార్టీ ఎమ్మెల్యేలు దూసుకురావటం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.
ఈ పరిస్థితులకు ముందే.. శుక్రవారం ఉదయం నుంచి సభ గందరగోళంగా ఉంది. విజయవాడలో వెలుగులోకి వచ్చిన కాల్ మనీ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి.. ఆయన కుమారుడుకి భాగస్వామ్యం ఉందంటూ విపక్ష నేత వైఎస్ జగన్ ఆరోపణలు చేశారు. ఇక.. కాల్ మనీ విషయంలో చర్చ చేపట్టాలంటూ విపక్షం పట్టుబట్టారు. ఓపక్క జగన్ ఈ డిమాండ్లు చేస్తే... రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మీద చర్చ జరిగిన తర్వాతే కాల్ మనీ మీద చర్చ చేపడదామంటూ ఏపీ అధికారపక్షం చెప్పింది. దీనికి విపక్ష నేతలు ససేమిరా అనటంతో సభలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలందరిపైనా అంబేడ్కర్ పై చర్చ జరిగే వరకూ సస్పెండ్ చేశారు.
అంబేడ్కర్ మీద చర్చ ముగిసిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సభలోకి వచ్చారు. ఈ సందర్భంగా కాల్ మనీ వ్యవహారంలో ముఖ్యమంత్రి మొదట స్టేట్ మెంట్ ఇస్తారని.. ఆ తర్వాత చర్చకు వెళదామని అధికారపక్షం వాదిస్తే.. వారి మాటలకు విపక్ష నేత జగన్ పాయింట్ ఆఫ్ అర్డర్ లేవనెత్తారు. దీనిపై ఇరు వర్గాలు వాదోపవాదాలు సాగుతున్న సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది వరకూ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు సీటు వద్దకు దూసుకురావటంతో అదికారపక్ష నేతలు ఒక్కసారి అలెర్ట్ అయ్యారు.
విపక్ష నేతలు దూకుడుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. సీఎం కుర్చీ వద్దకు అలా దూసుకురావటమేమిటని..? దాడి చేసినట్లుగా వ్యవహరించటం ఏమిటంటూ అధికారపక్షం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏది ఏమైనా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఈ తరహా దూకుడుతో వ్యవహరించటం సరికాదన్న మాట వినిపిస్తోంది. సీఎం కుర్చీ వద్దకు అంత పెద్ద సంఖ్యలో దూసుకురావాల్సిన అవసరం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు.