Begin typing your search above and press return to search.

ఆ కాంగ్రెస్ నేత పుట్టినరోజు..పోటెత్తిన వైసీపీ నేతలు?

By:  Tupaki Desk   |   17 Sept 2019 4:47 PM IST
ఆ కాంగ్రెస్ నేత పుట్టినరోజు..పోటెత్తిన వైసీపీ నేతలు?
X
బెల్లం ఉన్న చోటే ఈగలు వాలుతాయి... అది ఏ రకమైన బెల్లమైనా సరే.. ఇప్పుడు నేతలు కూడా అంతే.. ఏ పార్టీలో ఉన్నా సరే డబ్బు - పరపతి దండిగా ఉంటే చాలు వాళ్ల వెనుకాల పడుతారు.. పార్టీలు గట్రా ఏవీ వాళ్లకు అడ్డురావు. కాంగ్రెస్ సీనియర్ నేత - బడా పారిశ్రామిక వేత్త అయిన టి. సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు వేడుక సందర్భంగా ఇదే విచిత్రం చోటుచేసుకుంది.

టీ సుబ్బిరామిరెడ్డి వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో వెలుగు వెలిగిన నేత. బడా వ్యాపారవేత్త - బాగా డబ్బు పరపతి గల ఈయన కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు. ఇప్పటికీ ఈయన పరపతి రెండు తెలుగు రాష్ట్రాల్లో దండిగా ఉంది. కేసీఆర్ - చంద్రబాబు సహా చాలా మందిని మేనేజ్ చేయగల సామర్థ్యం ఈయనకు ఉందని చెవులు కొరుక్కుంటారు.

అయితే తాజాగా టీ సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజులు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఇటీవలే గెలిచిన వైసీపీ నాయకులు కూడా క్యూ కట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి - వుడా చైర్మన్ ద్రోణం రాజుతోపాటు ఎంతో మంది వైసీపీ నేతలు ఆయనకు భారీ పూలమాల వేసి ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రాయపడ్డారు. కాంగ్రెస్ నేత పుట్టిన రోజుకు వైసీపీ నేతలు హాజరై ఫొటో దిగి హంగామా చేయడం ఇప్పుడు వైసీపీ వర్గాల్ లోచర్చనీయాంశమైంది. ఎంత పెద్ద నేత అయితేనేం తమ పార్టీ కానీ నేతకు ఇలా సాగిలపడుతారా అన్న విమర్శలు వైసీపీ కార్యకర్తలు, నేతల నుంచి వ్యక్తమయ్యాయి.