Begin typing your search above and press return to search.

బొండా..కాల్వ బూతులతో ఆ బ్యాచ్ బెదిరిందా?

By:  Tupaki Desk   |   24 Dec 2015 8:38 AM GMT
బొండా..కాల్వ బూతులతో ఆ బ్యాచ్ బెదిరిందా?
X
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడంతా బూతుల పంచాంగం నడుస్తోంది. అధికారపార్టీ సభ్యుల్ని విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఏ స్థాయిలో బూతులు తిడుతున్నారో చూశారా అంటూ.. చీప్ విప్ సీడీలు విడుదల చేయటం.. అవి కాస్తా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే.

జగన్ బ్యాచ్ బూతులు వింటున్న వారు బెదిరిపోతున్న పరిస్థితి. శాసనసభలో ఇలాంటి బూతులు.. అది కూడా ప్రజాసేవ చేసేందుకే తాము పుట్టినట్లుగా చెప్పుకునే నేతారత్నాలు నోటి నుంచి రావటం పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూసిన వారికి.. చాలానే బూతులు వినపడకపోవటం.. వాటిని సీడీ రూపంలో విడుదల చేయటంతో జగన్ బ్యాచ్ మరీ ఇంత ఇదిగా బరి తెగించిందా? అన్న భావన కలిగేలా చేస్తోంది.

దీంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైతం ఇప్పుడు రంగంలోకి దిగారు. తమను అధికారపక్ష నేతలు బండబూతులు తిట్టారని..వారి బూతుల్ని వినలేకపోయేవారిమని.. ముందు వారే బూతుల పంచాంగం విప్పారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు చెందిన సీడీలు విడుదల చేస్తున్న ఏపీ సర్కారు.. అధికారపక్ష నేతలకు చెందిన సీడీలు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏపీ అధికారపక్షంలో చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు.. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుల నోటి నుంచి బండ బూతులు వస్తాయని.. వారి బూతుల్ని వినలేని పరిస్థితి ఉండేదని.. పవిత్ర అసెంబ్లీలో ఈ నేతలు మాట్లాడిన మాటల సీడీలు విడుదల చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.