Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీ పార్టీకి అవసరమా? వైసీపీలో చర్చ!

By:  Tupaki Desk   |   26 Oct 2019 2:30 PM GMT
వల్లభనేని వంశీ పార్టీకి అవసరమా? వైసీపీలో చర్చ!
X
ఎన్నికల ముందు చేరికలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానగణం బాగా హర్షించింది. ఎన్నికలు రెండు మూడు నెలల్లో ఉన్నాయనే నేపథ్యంలో చాలా మంది నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. వారిలో తెలుగుదేశం పార్టీ తరఫున పని చేసిన వారు, అప్పటికే టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు-ఎంపీలు,ఇతర నేతలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా మిగిలిపోయిన వారు వచ్చారు. అప్పుడంతా ఎవరు చేరినా బాగానే అనిపించింది కానీ, ఎన్నికల తర్వాత చేరికల పట్ల మాత్రం వైసీపీ అభిమానగణం అంత సంతోషంగా లేదు.

పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్లంతా వస్తున్నారనే భావన క్యాడర్ లో నెలకొంది. అది వాస్తవం కూడా. అధికారంలో ఉన్న పార్టీవైపే చాలా వరకూ వలసలు ఉంటాయి.ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ మోహన్ చేరిక విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీకి అవసరమా? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే కృష్ణా జిల్లా సామాజికవర్గం సమీకరణాల రీత్యా జగన్ మోహన్ రెడ్డి వల్లభనేనికి ప్రాధాన్యతను ఇస్తూ ఉండవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఒకసారి జగన్ ను కలిశారు వల్లభనేని. ఈ నేపథ్యంలో ఆయన చేరిక పట్ల కొంత సానుకూలత ఉంది.

అయితే వల్లభనేని చేరితే ఉప ఎన్నిక ఖరారు అయినట్టే. ఆ బై పోల్ లో టికెట్ వంశీకి దక్కదని స్పష్టం అవుతోంది. యార్లగడ్డకే టికెట్ ఇచ్చి గెలిపించాలని జగన్ ఆదేశించే అవకాశాలున్నాయి. వంశీ మోహన్ కు ఎమ్మెల్సీ పదవితో సహా ఎలాంటి నామిటనేటెడ్ పోస్టులూ దక్కే అవకాశాలు లేవని.. అయితే ఆయనకు కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశాలు మాత్రం ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తోంది.