Begin typing your search above and press return to search.
అభద్రతలో వైసీపీ ఎమ్మెల్యేలు - ఇన్ ఛార్జిలు
By: Tupaki Desk | 20 Oct 2017 11:09 AM GMTకొన్ని రోజుల కిందట.. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం లో చేరుతారని ప్రచారం జరిగినప్పుడు.. మీడియా ద్వారా ఓ సంగతి బయటకు వచ్చింది. జగన్ తో జరిగిన భేటీలో వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానం నుంచి తిరిగి పోటీ చేయడానికి టికెట్ హామీ ఇవ్వలేదని - చూద్దాం లే అన్నట్లుగా మాట్లాడారని - టికెట్ గురించి భరోసా ఇవ్వకపోవడంతో బుట్టా రేణుక.. ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారని మీడియాలో వచ్చింది....
నిజానికి ఇది బుట్టా రేణుక ఒక్కరి పరిస్థితి మాత్రమే కాదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ ఉందా? లేదా? అనే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన సిటింగ్ ఎమ్మెల్యేలు - నియోజకవర్గ ఇన్ ఛార్జిలుగా సంవత్సరాల తరబడి.. తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ అస్తిత్వాన్ని కాపాడడానికి కష్టించి పనిచేస్తున్న ఇన్‌ఛార్జులు అనేకమంది ఇదే అభద్రతలో ఉన్నారు. సాధారణంగా ఏ పార్టీలో అయినా.. అసాధారణ పరిస్థితులు తలెత్తితే తప్ప సిటింగ్ ఎమ్మెల్యేలకు - ఇన్ఛార్జిలుగా పనిచేస్తున్న వారికి టికెట్ గ్యారంటీ ఉంటుంది. కానీ వైసీపీ తీరు ఇందుకు భిన్నంగా ఉంది. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డు పడే చందంగా.. జగన్ కు అత్యంత సన్నిహిత కోటరీ అనే ముద్రతో మెలుగుతూ... పార్టీలో చెలరేగుతున్న కొందరు నాయకులు ఎమ్మెల్యేల్లో ఇలాంటి అభద్రతను సృష్టిస్తున్నట్లుగా తెలుస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణకు కొదువ లేదు. పార్టీ అధినేత జగన్ సీఎం కావాలని కోరుకునే తెలుగు ప్రజల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే పార్టీని నమ్ముకుని పార్టీకోసం పనిచేస్తున్న వారికి పార్టీ పరంగా అంతే దన్నుగా నిలిచే విషయంలో కొందరు నాయకులు చక్రం అడ్డు వేస్తూ... సృష్టిస్తున్న అనిశ్చితి ఏకంగా పార్టీకే ప్రమాదకరంగా మారుతోంది. గత ఎన్నికల సమయంలో గెలిచిన ఎమ్మెల్యేల్లో పార్టీ నుంచి ఇప్పటికే 21 మంది అధికార పార్టీలోకి వలసవెళ్లిపోయారు. మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా వలస వెళ్లడానికి వేర్వేరు రూపాల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా సమాచారం ఉంది. అయితే వీరందరికీ కూడా.. అధినేత నేరుగా వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వడం గురించి భరోసా ఇవ్వకపోవడమే కారణమనే మాట వినిపిస్తోంది.
అలాగే నియోజకవర్గాల్లో కొన్నేళ్లుగా పార్టీ ఇన్ ఛార్జిలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. పార్టీ ఉనికిని కాపాడడం కోసం తమ సొంత డబ్బు - సమయం వెచ్చిస్తూ.. దీర్ఘకాలంగా కష్టపడుతున్న వారు ఉన్నారు. తీరా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ఎవ్వరికీ టికెట్ గ్యారంటీ లేదు.. ఆ సమయంలో పరిస్థితుల్ని బట్టి గెలుపుగుర్రాలకు ఇస్తాం.. వంటి డైలాగులతో.. అసలు నియోజకవర్గాల్లో పనిచేసే వారి ఉత్సాహాన్ని కొందరు నాయకులు చంపేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ సన్నిహిత వర్గంలో ఉన్నాం కదా అనే ధైర్యంతో.. చక్రం తిప్పుతున్న కొందరు.. తమ స్వార్థ ప్రయోజనాలతో ప్రజలతో సంబంధం లేకుండా సాగుతున్న నాయకులను కొత్తగా తెరపైకి తీసుకువచ్చి... ఆయా నియోజకవర్గాల్లో సందిగ్ధ పరిస్థితులు నెలకొల్పుతున్నారు. దీనివల్ల పార్టీకే పెద్ద నష్టం జరుగుతోందని.. ఖచ్చితమైన హామీ అందకపోతున్నందువల్లనే.. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం కూడా అనుకున్నంత స్పందన సాధించలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి తన పరోక్షంలో నాయకులు సాగిస్తున్న ఇలాంటి నష్టదాయకమైన పనుల నుంచి పార్టీని కాపాడడానికి జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.