Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీకి షాక్.. హైకోర్టులో పిటీషన్

By:  Tupaki Desk   |   10 July 2019 7:10 AM GMT
వల్లభనేని వంశీకి షాక్.. హైకోర్టులో పిటీషన్
X
టీడీపీకి షాకుల మీద షాకులు ఇస్తున్నారు వైసీపీ అభ్యర్థులు. ఏపీలో వైసీపీ గాలి వీచింది. ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక మొన్నటివరకు అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23మందికే పరిమితమైంది. ఇప్పుడు 23 మంది కూడా లేకుండా పోయే ప్రమాదంలో టీడీపీ పడింది.

తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం పిటీషన్ దాఖలైంది. గన్నవరం నుంచే వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన వై. వెంకటరావు ఈ పిటీషన్ దాఖలు చేశారు.

కాగా ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచిన నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, అచ్చెన్నాయుడుల ఎన్నికల చెల్లదంటూ వారిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ అభ్యర్థులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పుడు తాజాగా వల్లభనేని వంశీపై కూడా పిటీషన్ దాఖలు కావడంతో అనర్హులయ్యే టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది.

తాజాగా వల్లభనేని వంశీ ఎన్నిక చెల్లదంటూ ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి వెంకటరావు పిటీషన్ దాఖలు చేశారు. వంశీ ఎన్నికల ప్రచార సభల్లో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనలను ఉల్లంఘించారని పిటీషన్ లో ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేశాడని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉండగా.. ఆయన అనుచరులు తహసీల్దార్ సంతకంతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని.. ఇవి నకిలీవని కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని వెంకట్రావ్ తన పిటీషన్లో పేర్కొన్నారు.

ఇప్పుడు పక్కా ఆధారాలను వెంకట్రావ్ బయటపెట్టడంతో వంశీ ఎన్నికపై హైకోర్టు తీర్పు ఎలా వస్తుందనే ఆసక్తి నెలకొంది. ఇలా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అనర్హతతో పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో టీడీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారన్న ఆందోళన ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.