Begin typing your search above and press return to search.
తన హయాంలో అప్పులను చంద్రబాబే తీర్చాడా ?
By: Tupaki Desk | 30 March 2021 5:30 AM GMT‘వైసీపీ ప్రభుత్వ హయాంలో చేస్తున్న అప్పులను జనాలే తీర్చాలి కానీ వైసీపీ నేతలెవరు తీర్చరు’..ఇది పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల వల్ల ప్రజలందరి నెత్తినా తలా రూ. 2.5 లక్షల అప్పు పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు నాశనమైపోయిందంటు మండిపడ్డారు.
పెట్టుబడులకు హైదరాబాద్ ను గమ్యస్ధానంగా మార్చినట్లే అమరావతిని కూడా మార్చుదామని అనుకున్నట్లు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన జగన్ చేసిన పనుల వల్ల రాష్ట్రానికి వస్తుందని అనుకున్న రూ. 2 లక్షల కోట్ల సంపద దెబ్బతినేసినట్లు చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు నాశనమైపోయిందని, యువత భవిష్యత్తు కూడా దెబ్బతినసినట్లు తెగ బాధపడిపోయారు.
చంద్రబాబు చెప్పిన మాటలు వినటానికి బాగానే ఉన్నాయి కానీ అసలు విషయాన్ని మాత్రం దాచిపెట్టినట్లు అందరికీ తెలుసు. 2014లో రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందే రూ. 16500 కోట్ల లోటు బడ్జెట్ తో. ఆ తర్వాత ఐదేళ్ళు పాలించిన చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయేనాటికి రాష్ట్రం అప్పు రూ. 2.85 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే చంద్రబాబు హయాంలో కూడా ప్రభుత్వం లక్షల కోట్ల అప్పుచేసిందన్న విషయం వాస్తవం.
2019లో అధికారంలోకి వచ్చేనాటికే లక్షల కోట్లు అప్పున్న ప్రభుత్వాన్ని నడపాలంటే జగన్ ఏమి చేయాలి ? అప్పులు చేయటం మినహా వేరే దారి ఏదన్నా ఉందా ? దీన్నే కావాలనే బూచిగా చూపించి నానా గోల చేస్తున్నారు చంద్రబాబు+టీడీపీకి మద్దతిచ్చే మీడియా. ప్రభుత్వాలు చేసిన అప్పులను ప్రజలే భరించాలి కానీ ముఖ్యమంత్రులు వ్యక్తిగతంగా ఎవరైనా తీరుస్తారా ? తన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తగ్గట్లుగా మాట్లాడితేనే జనాలు కూడా మెచ్చుకుంటారు. లేకపోతే కేవలం తనకు మద్దతిచ్చే మీడియాలో మాత్రమే చూసుకుని ఆనందించాలంతే.