Begin typing your search above and press return to search.

ఈ హోల్ సేల్ ఊకదంపుడు ఆపి.. ట్రాక్ మార్చండి చంద్రబాబు

By:  Tupaki Desk   |   23 Jun 2021 6:30 AM GMT
ఈ హోల్ సేల్ ఊకదంపుడు ఆపి.. ట్రాక్ మార్చండి చంద్రబాబు
X
అలవాటైన మాటలు అదే పనిగా వింటే బోర్ కొడతాయి. మారే కాలానికి తగ్గట్లు వ్యూహాలు మార్చకుండా.. పాత చింతకాయ పచ్చడిలా వ్యవహరిస్తే ఏం ప్రయోజనం. టీడీపీ అధినేత.. ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఇప్పుడు అదే తీరులో ఉంది. ఆయనెంత కష్టపడినా.. మరెంత తపన పడినా ప్రజల నమ్మకాన్ని పొందటంలో ఆయన వెనుకబడే ఉంటున్నట్లు చెబుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు చెలరేగిపోవాలి. సరైన ఇష్యూను టేకప్ చేయాలి. అంతే తప్పించి.. హోల్ సేల్ ఊకదంపుడు మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయం బాబుకు ఎప్పటికి అర్థమవుతుందో తెలీదు.

బాబుకున్న పెద్ద మైనస్ ఏమిటంటే.. తన రాజకీయ ప్రత్యర్థి జగన్ ను ఇరుకున పడేయటమే లక్ష్యమైనప్పుడు.. అలాంటి ఇష్యూను టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా బాబు ప్లానింగ్ మరోలా ఉంటుంది. ఈ నెల 29న ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిచ్చింది. ఇంతకీ ఈ ఆందోళన ఎందుకు? తాజా నిరసన దేనికి సంబంధించిందన్న విషయం చూస్తే.. ఒక్క ఇష్యూ కాకుండా బోలెడన్ని ఇష్యూలంటూ భారీ చిట్టానే చూపిస్తారు.

మరి.. అందులో ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా? అంటే.. అవేమీ కనిపించకపోవటం విశేషం. వ్యాక్సినేషన్ సరిగా జరగటం లేదన్నది మొదలుకొని జాబ్ కేలండర్ పై నిరుద్యోగుల నిరసన.. ఉపాధి కల్పన..వ్యవసాయం.. శాంతిభద్రతలు.. మహిళలపై అత్యాచారాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఇష్యూలు ఉన్నాయి. బాబు టేకప్ చేసిన ఇష్యూలలో ప్రజల్ని కనెక్టు చేసేది ఒక్కటి లేకపోవటం గమనార్హం. వారి భావోద్వేగాల్ని టచ్ చేసేలా ఒక్క అంశం ఉన్నా.. వారి నుంచి స్పందన ఉంటుంది. అలా కాకుండా.. పలు అంశాల్ని ప్రస్తావించటం వల్ల ఊకదంపుడు ఉపన్యాసం అవుతుందే తప్పించి.. మరెలాంటి ప్రయోజనం ఉండదు.

బాబు లెవనెత్తే అంశాల్లో తాజాదనంతో పాటు.. భావోద్వేగ అంశాలు ఉండటం.. ఆ అంశంలో తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రయత్నాల గురించి చెప్పే అవకాశం ఉండాలి. అలా.. ఏదైనా ఒక ఇష్యూను టేకప్ చేస్తే ఫర్లేదు కానీ.. భారీ ఎజెండాతో సాధించేది ఏమీ ఉండదన్న విషయాన్ని బాబు గుర్తిస్తే మంచిది. దానికి బదులు ఎంచక్కా హైదరాబాద్ లోని తన ఇంట్లో రెస్టు తీసుకోవటం మేలు.