Begin typing your search above and press return to search.

హర్ష కుమార్ లేఖ ఏమో కానీ.. బాబును ఉతికేశారుగా?

By:  Tupaki Desk   |   14 Aug 2020 8:00 AM GMT
హర్ష కుమార్ లేఖ ఏమో కానీ.. బాబును ఉతికేశారుగా?
X
ఎదురుదాడి కూడా అర్టే. ఈ విషయాన్ని ఏపీ అధికారపక్షానికి చెందిన నేతల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఎప్పుడేం మాట్లాడాలో.. ఏ అంశాన్ని ఎలా తమకు అనుకూలంగా తిప్పాలో.. అందులోని తెలివిగా బాబును ఇరికించాలన్న విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న శిరోముండనం వ్యవహారంపై దళిత నేత.. మాజీ ఎంపీగా వ్యవహరించిన హర్షకుమార్ తాజాగా రాష్ట్రపతికి ఒక లేఖ రాయటం.. దానిపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా తీయటం తెలిసిందే.

దీంతో ఒక్కసారిగా అలెర్టు అయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు స్పందించారు. లేఖ రాసిన హర్షకుమార్ కంటే.. ఆ లేఖ రాయటం వెనుక చంద్రబాబే ఉంటారన్న విషయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా విపక్ష నేత చంద్రబాబును విమర్శలతో ఉతికి ఆరేశారని చెప్పాలి. తమకేమాత్రం అవకాశం లభించినా.. బాబు మీద ఒంటికాలి మీద లేచే జగన్ పార్టీ నేతలు.. తాజా ఎపిసోడ్ లో లేఖ రాసిన హర్ష కుమార్ కంటే కూడా తమ టార్గెట్ మొత్తం బాబే అన్నట్లుగా వారి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

బాబుపై డీప్ వాష్ వ్యాఖ్యలు చేసిన వారిలో మాల కార్పొరేషన్ ఛైర్మన్ పెదపాటి అమ్మాజీ.. మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ కనకరావు తదితరులు ఉన్నారు. చంద్రబాబు హయాంలోజరిగిన ఉదంతాలపై అప్పటి ప్రభుత్వం స్పందించలేదని.. తాము మాత్రం ఇటీవలకాలంలో రాష్ట్రంలో చోటు ప్రతి అంశంపైనా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు.

‘చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్‌ల్లో హర్షకుమార్ ఒకరు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజికి అతడు కక్కుర్తి పడుతున్నాడు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు హర్షకుమార్ మాట్లాడుతున్నారు. చంద్రబాబు కాళ్లు పట్టుకున్న హర్షకుమార్‌ దళిత సమస్యలపై పోరాటం చేస్తామంటే ఎవరూ నమ్మరు. దళితులపై దాడి చేసిన చరిత్ర టీడీపీది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు జరిగాయి’ అని కనకరావు పేర్కొన్నారు. అమ్మాజీ సైతం ఇదే రీతిలో చంద్రబాబుపై విరుచుకుపడటం గమనార్హం.