Begin typing your search above and press return to search.

జగన్ బ్యాచ్ అక్రోశం అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   11 Oct 2015 7:51 AM GMT
జగన్ బ్యాచ్ అక్రోశం అంతా ఇంతా కాదు.
X
పట్టించుకోనట్లుగా ఉండటానికి మించిన పెద్ద శిక్ష మరొకటి ఉండదు. అది ప్రేయసికైనా.. ప్రతిపక్ష నేతకైనా. ఈ మాటలో నిజం ఎంత ఉందన్నది తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ బ్యాచ్ వైఖరి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ.. గడిచిన ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.

రోజురోజుకీ నీరసించిపోతున్న తమ అధినేతను చూసి వారి తెగ ఫీలైపోతున్నారు. మరోవైపు.. అధికారపక్షం మాత్రం చీమ కుట్టనట్లుగా ఉండిపోవటంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. విపక్షం చేపట్టిన ఆందోళన కానీ.. నిరసన విషయంలో కానీ అధికారపక్షం స్పందిస్తుంటే కాస్త ఉత్సాహంగా ఉంటుంది. అందుకు భిన్నంగా అసలేం జరగనట్లగా వ్యవహరించటం.. తమకే మాత్రం సంబంధం లేనట్లుగా ఉండటంతో జగన్ బ్యాచ్ కి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాని పరిస్థితి. అందుకే.. వారిప్పుడు నోటికి పని చెబుతున్నారు.

రోజులు గడిచే కొద్దీ అధినేత ఆరోగ్యం క్షీణిస్తుంటే.. అధికారపక్షానికి చీమ కుట్టినట్లుగా లేని పరిస్థితి. ఆందోళనలు.. నిరసనలు ప్రారంభించినంత తేలికగా ముగించలేని దుస్థితి. ఏదో ఒక హామీ అన్నది అటు రాష్ట్రం నుంచి కానీ కేంద్రం నుంచి రాకుండా దీక్షను కానీ విరమిస్తే.. ఇదంతా ప్రచారం కోసమే తప్ప.. మరొకటి కాదన్న అపప్రద మీద పడే ప్రమాదం ఉంది. అందుకేనేమో.. ఉన్నట్లుండి జగన్ బ్యాచ్ చంద్రబాబు వారి మంత్రుల్ని ఉద్దేశించి తీవ్రంగా మండిపడుతున్నారు.

రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ కష్టపడుతుంటే ఏపీ అధికారపక్షంలో మాత్రం కనీసం స్పందన లేదని వారు మండిపడుతున్నారు. ఇదే తీరుతో సాగితే.. రానున్న ఎన్నకల్లో ప్రజలు తిప్పి కొడతారంటూ శాపాలు పెడుతున్నారు. మొత్తంగా చూస్తే.. జగన్ బ్యాచ్ ను కవ్వించి...చిరాకు పుట్టించటంలో తెలుగు తమ్ముళ్లు సక్సెస్ అయ్యారనే చెప్పాలి.