Begin typing your search above and press return to search.
చంద్రబాబే నంబర్ 1 అంటున్న వైసీపీ
By: Tupaki Desk | 16 July 2016 7:28 AM GMTరాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై సర్వే చేసి ప్రధాని మోడీ వారికి ర్యాంకులు ఇచ్చారని.. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కు 1వ ర్యాంకు వచ్చిందని, ఏపీ సీఎం చంద్రబాబుకు ఒకటో ర్యాంకు వచ్చిందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మోడీ ఈ ర్యాంకులను ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే... టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నుంచి ప్రధాని అయిన మోడీయే చంద్రబాబుకు తక్కువ ర్యాంకు ఇచ్చినా కూడా ఏపీలో ప్రధాన ప్రతిపక్షం.. చంద్రబాబు అంటే మండిపడే వైసీపీ మాత్రం ఆయనకు ఒకటో ర్యాంకు ఇస్తామంటోంది. మోడీ తక్కువ ర్యాంకు ఇచ్చినా కూడా తాము మాత్రం చంద్రబాబుకే ఫస్టు ర్యాంకు ఇస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే.. పాలన - అభివృద్ధిలో కాకుండా అవినీతిలో చంద్రబాబుకు ఫస్టు ర్యాంకు ఇస్తామని వారు చెబుతున్నారు.
త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్యంగా విభజన హామీలు - ఫిరాయింపు రాజకీయాలు తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని వైసీపీ నిర్ణయించింది. స్పీకర్ చేతిలో అధికారాలు పెట్టేసరికి ఫుల్ స్టాప్ లేదు, కామా లేదు అంటూ అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తున్నారని వైసీపీ ఎంపీ మేకపాటి ఆక్షేపించారు. స్పీకర్ పరిధి నుంచి అనర్హత వేసే అధికారాన్ని తొలగించి ఈసీకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. అది కూడా మూడు మాసాల్లో అనర్హత వేటు పడేలా చూడాలన్నారు. దీనిపై తాము పెట్టే ప్రైవేట్ బిల్లుకు ప్రజాస్వామ్యవాదులంతా మద్దతు తెలపాలన్నారు. లేకుంటే దేశంలో ప్రజాస్వామ్యం అంతర్జాతీయంగా నవ్వులపాలవుతుందన్నారు. వైఎస్ తవ్విన కాలువల్లో నీరు వదిలి కృష్ణ - గోదావరిని అనుసంధానం చేశామంటూ చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని విమర్శించారు.
అవినీతిలో ఏపీని నెంబర్ వన్ గా మార్చి తెలుగు వాళ్ల పరువును చంద్రబాబు తీశారని మేకపాటి విమర్శించారు. తాము కావాలనే టీడీపీని టార్గెట్ చేస్తున్నామని చెప్పడం సరికాదని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ - బీజేపీని కాకుండా తాము ఎవరిని టార్గెట్ చేయాలని ప్రశ్నించారు. స్పీకర్ అధికారులు దేశ వ్యాప్తంగా దుర్వినియోగం అవుతున్నాయని సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.