Begin typing your search above and press return to search.
ఎంపీ విజయసాయి విజయం.. మరి, మంత్రి అవంతి?
By: Tupaki Desk | 17 March 2021 10:30 AM GMTపరీక్ష పాసైపోవడమంటే.. 35 మార్కులు వచ్చినా గట్టెక్కినట్టే.. 99 మంది మార్కులు వచ్చినా ఉత్తీర్ణత సాధించినట్టే! కానీ.. రెంటికి మధ్య అంతరం ఎంత అన్నదే పాయింటు. ఫస్టు క్లాస్లు, డిస్టింక్షను అంటూ చాలా గ్రేడ్లు ఉంటాయి. ఇదే తీరును.. పొలిటికల్ పాస్ పర్సంటేజీ గురించి డిస్కస్ చేయాల్సి వస్తే.. ఆ లెక్కే వేరు. ఇక్కడ సవాలక్ష ఈక్వేషన్లు ఉంటాయి. ఇప్పుడు విశాఖ వైసీపీలో ఇదే హాట్ టాపిక్. మునిసిపాలిటీ ఎన్నిల్లో విజయం సాధించినప్పటికీ.. ఆశించిన గ్రేడ్ ఎంత? వచ్చిన పర్సంటేజీ ఎంత అనేది వాడీవేడి సాగుతోంది.
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్లు మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. ఎన్నికల వేళ క్లీన్ స్వీప్ చేస్తామని వైసీసీ నాయకులు బయటకు చెప్పినప్పటికీ.. అంతర్గతంగా కూడా దాదాపు 80 వరకు సీట్లను టార్గెట్ చేశారు. కానీ.. ఫలితాలు చూస్తే.. వైసీపీ 58 స్థానాలు సొంతం చేసుకుంది. దీంతో.. విజయమైతే సాధించా కానీ, లెక్క ఎక్కడ తేడా వచ్చిందన్నది పార్టీ అంతర్గత చర్చకు కారణమైంది.
అయితే.. విశాఖపై పార్టీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. కార్పొరేషన్ ను ఎలా దక్కించుకోవాలి? అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందన్న విషయాల వరకూ దగ్గరుండి చూసుకున్నారు. దీంతో.. వైసీపీకి ఈ స్థాయిలో స్థానాలు వచ్చాయంటే.. అది విజయసాయిరెడ్డి కృషే అన్నది ఆయన వర్గీయుల మాట.
దీంతో.. అందరి చూపూ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్ పైనే పడింది. ఆయన వైఫల్యమే ఈ ఫలితాలకు కారణంగా చూపుతున్నారు కొందరు. దీనికి సాక్ష్యాధారాలను కూడా చూపిస్తున్నారు. ఆయన సామాజిక వర్గం నుంచి, ఆయన క్యాంప్ ఆఫీసు ఉన్న ప్రాంతాల్లో కూడా టీడీపీ ప్రభావం చూపిందని, ఇది వైఫల్యం కాక మరేమిటి అని ప్రశ్నిస్తున్నారు.
మొత్తంగా.. విజయసాయి రెడ్డి వల్లే విశాఖ దక్కిందనే చర్చ వైసీపీలో నడుస్తోందట. దీంతో.. మంత్రి అవంతి పరిస్థితి ఏంటనే డిస్కషన్ కూడా మొదలైంది. ఎలాగో త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ మేరకు ఎవరిని ఉంచాలి? ఎవరిని దించాలనే షార్ట్ లిస్టు కూడా రెడీ అయ్యిందంటున్నారు. మరి, ఈ ఫలితాలు లెక్కలోకి తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? అని చర్చించుకుంటున్నారు వైసీపీ కార్యకర్తలు.