Begin typing your search above and press return to search.

జగన్ పై మరీ ఇంత అక్కసా ?

By:  Tupaki Desk   |   5 May 2021 3:30 PM GMT
జగన్ పై మరీ ఇంత అక్కసా ?
X
తెలుగుదేశంపార్టీకి మద్దతుగా నిలబడే మీడియాకు జగన్మోహన్ రెడ్డిపై ఎంత అక్కసుందో అర్ధమైపోతోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా సదరు మీడియా తప్పుగా వక్రీకరించింది. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో మూతపడిన డైరీలను అమూల్ డైరీకి అప్పగించాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. మూతపడిన డైరీలను అప్పగిస్తే అమూల్ యాజమాన్యం వాటిని పునరుద్ధరించి తిరిగి వాడుకలోకి తీసుకొస్తుంది.

ఈ చర్యవల్ల మళ్ళీ రైతులు, లేదా పాడిపై ఆధారపడ్డవారి యాక్టివిటీ మొదలవుతుంది. ప్రతినెల ఎంతోకొంత ఆదాయం కూడా మొదలవుతుంది. స్ధూలంగా ప్రభుత్వ ఉద్దేశ్యం అయితే ఇదే. కానీ టీడీపీకి మద్దతుగా నిలుస్తున్న మీడియా మాత్రం ఏపి డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆస్తులను అమూల్ కు లీజురూపంలో అప్పగించేస్తున్నట్లు రాసేశాయి.

మూతపడిన డైరీలను అప్పగించటానికి, ఏపి డైరీ ఆస్తులను అమూల్ కు అప్పగించటానికి తేడా లేదా ? రాష్ట్రంలో చిన్నా , చితకా డైరీలు చాలానే మూతపడ్డాయని సమాచారం. నిర్వహణ లోపం వల్ల, రాజకీయ కారణాలతో కొన్ని డైరీలు మూతపడిపోయాయి. ఇపుడు వాటికి పూర్వవైభం తీసుకురావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే మూతపడిపోయిన వాటిని అమూల్ కు అప్పగించాలని నిర్ణయించింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పేర్నినాని చాలా స్పష్టగా మీడియాకు వివరించారు. మూతపడిన డైరీలను పునరుద్ధరణలో భాగంగా అమూల్ కు అప్పగించబోతున్నట్లు ఇంత స్పష్టంగా చెప్పినా టీడీపీ మీడియా మాత్రం ఏపీ డెయిరీ ఆస్తులను లీజుకు అమూల్ కు అప్పగించేస్తున్నారని ఉద్దేశ్యపూర్వకంగానే రాశాయి. ప్రభుత్వంమీద కోపముంటే తీర్చుకోవచ్చు కానీ ప్రెస్ మీట్ లో చెప్పినదాన్ని కూడా వక్రీకరించి రాశారంటే జగన్ పై ఎంత అక్కసుందో అర్ధమైపోతోంది.