Begin typing your search above and press return to search.
రాజ్యసభ ఎన్నికలతోనే ఆగిపోయిన ‘ఆకర్ష’
By: Tupaki Desk | 13 Jun 2016 7:15 AM GMT ఏపీలో ప్రతిపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ ఎత్తున సాగిన వలసలు కొద్దిరోజులుగా ఆగిపోయాయి. ఇంకా చాలామంది వస్తారని టీడీపీ నాయకులు ప్రకటించినా ప్రస్తుతానికి అలాంటి సూచనలేవీ కనిపించడంలేదు. వచ్చినా కూడా ఒకరిద్దరు తప్ప టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు వచ్చేలా లేదు. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికల అవసరాల నేపథ్యంలో చేరికలను ప్రోత్సహించినట్లుగా కనిపించింది. రాజ్యసభ ఎన్నికలకు ముందు వైకాపా నుంచి టిడిపిలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మరికొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, కొద్ది రోజులకు వైకాపాను ఖాళీ చేయిస్తామని చెప్పుకొచ్చారు. ఎందుకోకానీ, రాజ్యసభ ఎన్నికల తరువాత వైకాపా నుంచి వలసలు తగ్గాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు నికరంగా వైకాపాలో కొనసాగుతారా? లేదా? అన్న అంశాన్ని పక్కన పెడితే, ఇప్పటికే ఆ పార్టీని వీడి టిడిపిలో చేరిన కొద్దిమంది ఎమ్మెల్యేల్లో అసహనం పెరుగుతోందని, ఒక అరడజను ముంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు సంకేతాలు పంపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
వైకాపాకు చెందిన సుమారు 17 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇందులో సీనియర్ రాజకీయ నాయకులు భూమా నాగిరెడ్డి - జ్యోతుల నెహ్రూ - వరుపుల సుబ్బారావు - సుజయకృష్ణ రంగారావు వంటి వారు ఉన్నారు. తమతమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, అభివృద్ధిని కాంక్షించి అధికార పార్టీలో చేరుతున్నామని వైకాపాను వీడి వెళ్లి ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అయితే, వలస వెళ్లిన ఎమ్మెల్యేల్లో కొందరు ఇప్పుడు టిడిపిలో ఇమడలేకపోతున్నారని తెలుస్తోంది. టీడీపీలో ఉన్న నేతలతో ఇమడలేక కొందరు.. తాము ఆశించిన గ్రోత్ కనిపించక ఇంకొందరు అసంతృప్తి చెందుతున్నట్లుగా తెలుస్తోంది.
గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని ఆయా నియోజకవర్గాలకు ఇన్ చార్జులుగా నియమించారు. ఇప్పుడు అదే నియోజకవర్గాల నుంచి వైకాపా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీలో బోలెడన్ని నిధులున్నాయి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని అనుకున్నారు. ఖజానా నుంచి చిల్లిగవ్వకూడా రాకపోవడంతో వైసీపీ నుంచివెళ్లిన వారంతా షాకవుతున్నారు. నియోజకవర్గంలో కాస్తంత పనులవుతున్నాయన్న భావన తప్ప, వ్యక్తిగత ప్రతిష్ట మాత్రం పెరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో చెప్పి, చిన్న చిన్న పనులు చేయించుకోగలుగుతున్నామని కొంతమంది ఎమ్మెల్యేలు సంతృప్తిగానే ఉన్నా ఇంకొందరు మాత్రం ఇంకా ఎక్కువ ఎక్సుపెక్టు చేసి ఇప్పుడు కాస్త అసంతృప్తిగా ఉణ్నారు. మొన్న జరిగిని టిడిపి మహానాడులో కూడా వలస ఎమ్మెల్యేలకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైకాపా నుంచి టిడిపిలో వెళ్లిన సీనియర్ నాయకులు భూమా నాగిరెడ్డి - జ్యోతుల నెహ్రూ - సుజయకృష్ణ రంగారావు - జలీల్ ఖాన్ లు మంత్రి పదవులను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కృష్ణా పుష్కరాల తరువాత కానీ మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు కనిపించకపోవడం.. వచ్చిన తమలో ఒకరిద్దరికే తప్ప మిగతా వారికి ఛాన్సు ఉండదని అర్థం కావడంతో సీనియర్ వలస పక్షులూ ఆవేదన చెందుతున్నట్లు టాక్.