Begin typing your search above and press return to search.

ఈసీని క‌లిసిన జ‌గ‌న్ పార్టీ నేత‌లు ఏం చెప్పారంటే?

By:  Tupaki Desk   |   28 March 2019 12:01 PM GMT
ఈసీని క‌లిసిన జ‌గ‌న్ పార్టీ నేత‌లు ఏం చెప్పారంటే?
X
ఏపీ ప్ర‌భుత్వం.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరుపై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు తాజాగా ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో చోటు చేసుకుంటున్న అధికార దుర్వినియోగాన్ని.. ఏపీకి చెందిన అధికారులు కొంద‌రు అనుస‌రిస్తున్న తీరును ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో సీనియ‌ర్ నేత‌లు విజ‌య‌సాయిరెడ్డి.. వైవీ సుబ్బారెడ్డి.. ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు.. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీ డీజీపీ ఠాకూర్ తీరును త‌ప్పు ప‌ట్టారు. ఆయ‌న‌పై కొన్ని ఆరోప‌ణ‌లు చేశారు. ఈసీ దృష్టికి జ‌గ‌న్ పార్టీ నేత‌లు తీసుకెళ్లిన అంశాలివే..

+ ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ను తొలగించాలి.

+ కేఏ పాల్‌ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థుల పేర్లు చాలావ‌ర‌కూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థుల పేర్లతో పోలి ఉన్నాయి.

+ ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాఫ్టర్‌ను ఉపసంహరించాలి.

+ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వ్యవహారంలో వ‌డుద‌ల చేసిన వివాదస్పద జీవోను ప‌రిశీలించాలి

+ ఈసీ ఆదేశాలను ఉల్లఘించేందుకు చీఫ్‌ సెక్రటరీతో చంద్రబాబు చర్చలు జ‌రిపిన వైనం

+ గ‌తంలో మేం మీ దృష్టికి తీసుకొచ్చిన చాలా అంశాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌టం

+ డీజీపీ ఠాకూర్ తన వాహనంలో 35 కోట్ల రూపాయలను ప్రకాశం జిల్లాకు చేరవేశారు.

+ ఠాకూర్‌ విషయంలో న్యాయం జరగలేదని వైఎస్సార్‌ సీపీ భావిస్తోంది.

+ ఠాకూర్‌ సహా కొందరు పోలీసు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

+ మేం ఫిర్యాదు చేసిన దామోదర్‌నాయుడు - ఘట్టమనేని శ్రీనివాసరావు - యోగానంద - ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ - చిత్తూరు జిల్లా ఎస్పీ - గుంటూరు జిల్లా రూరల్‌ ఎస్పీలపై ఈసీ బదిలీ చేయలేదు.