Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను చూసి బాబు నేర్చుకోవాలంటున్న చెవిరెడ్డి!
By: Tupaki Desk | 22 Feb 2017 4:47 AM GMTరాజకీయాల్లో టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి కంటే... టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జూనియర్ కిందే లెక్క. వయసులో చూసినా... రాజకీయంగా అనుభవం చూసినా... చేపట్టిన పదవులు చూసినా... కేసీఆర్ కంటే చంద్రబాబే సీనియర్. అందుకేనేమో చంద్రబాబును కేసీఆర్ అన్నా అంటూ సంబోధిస్తారు. అయినా వీరిద్దరిలో ఎవరు సీనియర్ అయితే ఏంటీ? ఎవరు జూనియర్ అయితే ఏంటి? ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరి పొజిషన్లూ ఈక్వలే కదా అంటారా? ఈక్వలే అయినా... ఇప్పుడు ఈ జూనియర్, సీనియర్ ప్రస్తావన ఎందుకంటారా? వైసీపీ కీలక నేత, చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటే మాత్రం... ఈ ప్రస్తావన అవసరమేననిపించక మానదు.
అయినా... చెవిరెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరిస్తే... ప్రముఖ ఆలయాలకు చెందిన దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తానని టీఆర్ ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందేగా. అందులో భాగంగా తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించేందుకు నిన్న కొండపైకి చేరుకున్న కేసీఆర్ ను వైసీపీ కీలక నేత, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పార్టీ యువనేత - రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలతో కలిసి చెవిరెడ్డి కలిశారు. తిరుపతి నుంచి నేరుగా తిరుమల చేరుకున్న వీరు ముగ్గురు... కేసీఆర్ బస చేసిన శ్రీకృష్ణ అతిథి గృహానికి వెళ్లారు. అక్కడ కేసీఆర్‌తో కాసేపు మాట్టాడి వచ్చారు. పొరుగు రాష్ట్రానికి సీఎంగా ఉన్న నేతను, విపక్షంలో ఉన్న నేతలు ఎందుకు కలిశారంటూ ఈ భేటీపై పలు కథనాలు వచ్చాయి.
భేటీ తర్వాత గెస్ట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటికీ కేసీఆర్ గొప్ప వ్యక్తి అని, అందుకే ఆయనను కలిశామని మిథున్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన చెవిరెడ్డి తనదైన శైలిలో చంద్రబాబుకు చురకలంటించారు. విపక్షాలను గౌరవించడంలో కేసీఆర్ ముందువరుసలో ఉన్నారని, విపక్షాలంటే కేసీఆర్ కు ఎనలేని గౌరవం ఉందని కూడా చెవిరెడ్ది చెప్పారు. అయితే అందుకు విరుద్ధంగా విపక్షాలంటే ఏమాత్రం గౌరవం లేకుండా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కనీసం కేసీఆర్‌ను చూసి అయినా విపక్షాలను ఎలా గౌరవించాలో నేర్చుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/