Begin typing your search above and press return to search.
మిథున్ రెడ్డి యవ్వారానికి లోకేశ్ కు ఏంలింకెట్టారు
By: Tupaki Desk | 25 Jan 2016 3:59 AM GMTలింకులెట్టటంలో ఓ రేంజ్ ప్రతిభను ప్రదర్శించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిపై రేణిగుంట ఎయిరిండియా మేనేజర్ రాజశేఖర్ పై దాడి వ్యవహారంలో ప్రస్తుతం రిమాండ్ ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మిథున్ రెడ్డి దాడి వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ గత కొద్ది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో సహా పలువురునేతలు డిమాండ్ చేయటం తెలిసిందే.
ఇంతవరకూ బాగానే ఉన్నా.. తాజాగా రెండు లింకులతో జగన్ పార్టీ చేస్తున్న ప్రచారం చూస్తే వారి తెలివితేటలకు షాక్ తినాల్సిందే. ఎయిరిండియా మేనేజర్ పై ఎంపీ మిథున్ దాడికి సంబంధించి ప్రభుత్వం చూపిస్తున్న ఆధారాల్లో ఎక్కడా ఎంపీ చేయి చేసుకున్న ఆధారాలు లేవని.. కేవలం కక్ష సాధింపు ధోరణితో ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారంటూ విమర్శిస్తోంది. మిధున్ మీద చేస్తున్న దాడి ఆరోపణలకు చూపిస్తున్న సాక్ష్యాల్లో ఎక్కడా ఆయన దాడికి పాల్పడినట్లుగా లేవని చెబుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు.. ఈ సందర్భంగా సరికొత్త రాజకీయ దాడికి తెర తీశారు.
ఆధారాలంటే.. ఏపీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను బయటకు తీసుకొచ్చిన వారు.. ఆధారాలంటే ఇలా ఉండాలంటూ ఉదాహరణ చూపించటం ఆసక్తికరంగా ఉంది. ఇంతకీ లోకేశ్ కు సంబంధించి జగన్ బ్యాచ్ చూపిస్తున్న ఫోటోలు చూస్తే.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో హడావుడి చేసిన ఫోటోలు కావటమే. అమెరికాలో లోకేశ్ చదువుకున్న రోజుల్లో కొందరు విదేశీ మిత్రుల (వారిలో అమ్మాయిలు కూడా ఉన్నారు)తో కాస్త క్లోజ్ గా ఉన్నట్లుగా (ఒకమ్మాయి భుజం మీద చేయి వేసి మందుగ్లాస్ చేపించటం.. ఒక అబ్బాయి.. అమ్మాయి ఇద్దరితోకలిసి డ్యాన్ చేస్తున్న దృశ్యం.. ఇద్దరు మహిళలు లోకేశ్ భుజం మీద వాలి ఉన్న ఫోటో.. స్విమ్మింగ్ ఫూల్ లోఒక సమూహంతో లోకేశ్ ఉండటం. ఆ సందర్భంగా ఆయన పక్కన ఒక మహిళ ఉండటం) ఉన్న ఫోటోల్ని విడుదల చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నట్లు చెబుతున్న జగన్ బ్యాచ్.. ఆధారాలు.. సాక్ష్యాలు అంటే ఇలా ఉండాలే కానీ.. ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ అధికారపక్షం చూపిస్తున్న (?) ఆధారాల మాదిరి ఉండకూడదని వాదించటం చూస్తే.. ఆశ్చర్యం కలగక మానదు. ఏపీ అధికారపక్ష నేతలు విడుదల చేసిన వీడియో ఫుటేజ్ లో ఎక్కడా మిథున్ రెడ్డి లేరని.. ఎయిరిండియా మేనేజర్ పై దాడి చేసినట్లుగా ఆధారాలు లేకున్నా.. తమ పార్టీ ఎంపీపై కేసులు బనాయిస్తున్నట్లుగా వారు వాదిస్తున్నరు. అయితే.. సంబంధం లేని రెండు అంశాలకు ‘‘ఆధారాలంటే ఇలా ఉండాలంటూ’’ కొత్త వాదనను వినిపిస్తూ జగన్ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా సంబంధం లేని రెండు అంశాలకు లింకు పెట్టే ప్రయత్నం పెట్టటం సరికాదన్న వాదన వినిపిస్తోంది.