Begin typing your search above and press return to search.
పోలింగ్ బూత్ లలోకి జనం పాదయాత్ర చేయాలి..
By: Tupaki Desk | 25 Sep 2018 4:16 AM GMTజగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు ఉత్తరాంధ్రలో ఎంతో కీలకమైన విశాఖపట్నం జిల్లాలో జనం నుంచి వచ్చిన అమోఘ స్పందన జోరు ఆ పొరుగు జిల్లా విజయనగరంలోనూ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుండి విశాఖపట్నం జిల్లాలోకి ఆయన పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి యాత్ర మరింత జనసమ్మర్థంగా మారిపోయింది. విశాఖ నగరంలోని కంచర్లపాలెం బహిరంగ సభకు వచ్చిన జనాలను చూసి తెలుగుదేశంపార్టీ నేతలే షాకయిపోయారు. పాదయాత్ర జరిగిన చాలా చోట్ల ఎంత వర్షం పడుతున్నా లెక్కచేయకుండా జనాలు జగన్ కోసం ఎదురు చూడటం - ప్రసంగం అయిపోయినా వర్షంలో అలానే నిలబడటం చూస్తేనే జగన్ అంటే జనాల్లో ఎంత అభిమానం ఉందో ఇట్టే అర్ధమైపోతోంది.
ఉత్తరాంధ్రలోని మరో జిల్లా విజయనగరంలోనూ ఇదే అభిమానం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఇలాగే ఉంటుందని భావిస్తున్నారు. అయితే... జగన్ పాదయాత్ర మరో నెల రోజుల్లో ముగియనున్న తరుణంలో ఆయన పాదయాత్ర స్ఫూర్తిని - జోరును ఆ పార్టీ నేతలు పోలింగ్ బూత్ ల వరకు తీసుకెళ్లడమే ఇక కీలకం. అంతేకాదు... జగన్ సైతం పాదయాత్రలో కనిపించిన స్పందన చూసి ఏమాత్రం రిలాక్సయిపోరాదు. ఇంతవరకు జనంతో మమేకమైన ఆయన ఇకపై రాజకీయంపై దృష్టిపెట్టాలి. ఎక్కడా ఉపేక్షించకుండా... లోపాలను గుర్తిస్తూ... వాటిని సవరిస్తూ సాగితేనే చంద్రబాబు ఎన్నికల అనుభవాన్ని తట్టుకుని నిలవగలుగుతారు. ఈ క్రమంలో జగన్ 2014లో చేసిన పొరపాట్లను మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి.
ప్రస్తుతం వైసీపీ పరిస్థితిని వాస్తవ కోణంలో చూస్తే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిజిల్లాలో ఉన్న కీలక నేతల్లో పార్టీపై 100 శాతం కమిట్ మెంట్ తో పనిచేస్తున్నవారెందరన్నది చూడాలి... అలాగే, ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి సమర్థులైన అభ్యర్థులున్నారా అన్నదీ ప్రశ్నే. ఈ అంశాలను సమీక్షించుకుంటూ ఏఏ నియోజకవర్గాల్లో పార్టీకి తిరుగులేని విజయావకాశాలున్నాయి.. ఎక్కడెక్కడ గెలుపు కష్టం? అనేదీ స్పష్టతతో ఉండాల్సి ఉంది.
ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే గత ఎన్నికల్లో ఇక్కడి మూడు జిల్లాల్లోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి గెలిచింది తొమ్మిది మాత్రమే. మిగిలిన 25 నియోజకవర్గాలు అప్పట్లో మిత్రపక్షాలైన టిడిపి - బిజెపిలు గెలుచుకున్నాయి. గెలిచిన తొమ్మిది స్థానాల్లోనూ పలువురు టీడీపీలోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లోనూ జగన్ పట్ల అభిమానం ఇలాగే ఉంది. అయినా... దాన్ని ఓట్లరూపంలో మలుచుకోవటంలో అభ్యర్ధులు - నేతలు విఫలమయ్యారు.
దాంతో పాటు పార్టీపరంగా పలు నిర్ణయాల్లో జాప్యం దెబ్బతీసింది. పలుచోట్ల సరైన అభ్యర్థులను ఎంపికచేయకపోగా కొన్ని చోట్ల చివరి నిమిషం వరకు టిక్కెట్లు ప్రకటించలేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రచారంలోను - పోలింగ్ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకోవటంలో కూడా చాలా మంది అభ్యర్ధులు విఫలమయ్యారు. ప్రస్తుత ఎన్నికలను చూస్తే... టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంటోంది.. కానీ, చాపకింద నీరులా తన సంప్రదాయ ఓటుబ్యాంకును పటిష్టం చేసుకుంటోంది. పైగా అధికార - ధన బలం ఉన్న పార్టీ కావడంతో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ టీడీపీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. జగన్ తన పాదయాత్రతో తీసుకొచ్చిన మైలేజిని పాడుచేసుకోకుండా పార్టీ నేతలు - అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేస్తేనే వైసీపీ కల నెరవేరుతుంది.