Begin typing your search above and press return to search.
టీడీపీ సీనియర్ నేతకు వైసీపీ ఆఫర్
By: Tupaki Desk | 16 March 2019 11:28 AM GMTఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్ లు కొనసాగుతున్నాయి. ప్రలోభాలు.. టికెట్ ఆఫర్లతో టీడీపీ, వైసీపీ ఆఫర్ల వాన కురిపిస్తున్నాయి. దీంతో ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు పార్టీలు మారే పనిలో నేతలు బిజీగా ఉన్నారు.
తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాజమండ్రికి చెందిన ప్రముఖ నర్సరీ వ్యాపారి గంగుమళ్ల సత్యనారాయణకు వైసీపీ టికెట్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి కొంతమంది రాజమండ్రి వచ్చి సత్యానారాయణ ఇంటికి వెళ్లి మరీ వైసీపీలోకి ఆహ్వానించారని తెలిసింది.
టీడీపీలో సత్యానారాయణ చాలా సార్లు టికెట్ ఆశించి భంగపడ్డారు. రాజమండ్రి రూరల్ సీటును పోయిన సారి ఆశించారు. కానీ టీడీపీ ఆ సీటును బీజేపీకి ఇచ్చేయడంతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి గెలిచారు. అయినా పార్టీ మారకుండా సత్యనారాయణ టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఈసారి కూడా టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. యనమల, చిన్నరాజప్పలతో కలిసి చంద్రబాబును కలిసి టికెట్ కావాలని కోరారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్లకే టీడీపీ టికెట్ ను అధిష్టానం ఖరారు చేసింది.
రాజమండ్రి రూరల్ పై ప్రస్తుతం టీడీపీ నుంచి బుచ్చయ్య చౌదరి.. జనసేన నుంచి కందుల దుర్గేష్ బలంగా ఉన్నారు. వారికి గట్టి పోటీనిచ్చేందుకు వైసీపీ రాజకీయంగా బలమైన వ్యక్తిగా ఉన్న సత్యనారాయణపై కన్నేసింది. ఆయన్ను వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ దీనిపై సన్నిహితులతో మాట్లాడి చెబుతానని సత్యనారాయణ వైసీపీ నేతలు చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ లో రసవత్తర రాజకీయం మొదలైంది.
రాజమండ్రి రూరల్ మండలానికి చెందిన సత్యనారాయణకు వైసీపీ టికెట్ ఇస్తే ఈజీగా గెలువచ్చని అంటున్నారు. మిగతా వారందరూ సిటీకి చెందిన వారు కావడం.. సత్యనారాయణ రాజమండ్రి రూరల్ మండలానికి చెందిన వారు కావడం ఈయనకు ప్లస్.. మరి సత్యనారాయణ ఏం నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తిగా మారింది.