Begin typing your search above and press return to search.

వైసీపీ ఈ లోటుపాట్లను ఎప్పటికి దిద్దుకుంటుందో!

By:  Tupaki Desk   |   1 Oct 2019 12:38 PM GMT
వైసీపీ ఈ లోటుపాట్లను ఎప్పటికి దిద్దుకుంటుందో!
X
ఇప్పటికీ మీడియా మేనేజ్ మెంట్ విషయంలోనూ - పార్టీ వాయిస్ ను జనాల్లోకి తీసుకెళ్లడం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాఠాలు నేర్వలేదని అంటున్నారు పరిశీలకులు. అధికారంలోకి వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఇందుకు సంబంధించి ఒక క్రమపద్ధతి ఏర్పడటం లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. పార్టీ వాయిస్ ఏదైనా - ఏ అంశం మీద అయినా గట్టిగా జనాల్లోకి వెళ్లేలా మీడియాకు డిక్టేట్ చేయడం విషయంలో - తమ వాయిస్ ను బలంగా వినిపించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనుకబడే ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికీ ఆ పార్టీలో ఒక సిస్టమ్ ఏర్పడలేదనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాలని అంటున్నారు. తమ వాయిస్ ఏదైనప్పటికీ దాన్ని ఒక వ్యూహాత్మకంగా.. ఆ పార్టీ నేతలు తెలియజెప్పుతూ ఉంటారు.

ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఒకే అంశం మీద ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ ఉంటారు. పార్టీ వాయిస్ ను రకరకాలుగా తీసుకెళ్తారు. దానికంతటికీ ఆర్డర్స్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచినే వస్తాయని అంటారు. ఎవరు ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ తెలుగుదేశం ఆఫీసు నుంచినే చేరుతుందని, ఆ మేరకు నేతలు స్పందిస్తారని జర్నలిస్టులు అంటూ ఉంటారు. అలాంటి సిస్టమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఏర్పడకపోవడం గమనార్హం.

ఆవిర్భవించి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ విధానం ఏర్పడలేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ అధికారిక ప్రెస్ మీట్లను పెట్టే నేతలు కూడా ఐదారు నిమిషాలకు ముగించేస్తున్నారు. ఐదారు లైన్లకు పరిమితం అవుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మీడియా సలహాదారులు కూడా మొద్దునిద్రలో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని ఎప్పటికి సరి చేసుకుంటుందో.. అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.