Begin typing your search above and press return to search.

జ‌గ‌న‌న్న కాల‌నీలు.. వైసీపీలో కొత్త ర‌గ‌డ‌.. ఏం జ‌రుగుతోందంటే!

By:  Tupaki Desk   |   17 Sept 2021 8:00 AM IST
జ‌గ‌న‌న్న కాల‌నీలు.. వైసీపీలో కొత్త ర‌గ‌డ‌.. ఏం జ‌రుగుతోందంటే!
X
ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న జ‌గ‌న‌న్న కాల‌నీల నిర్మాణం.. పార్టీకి స‌రికొత్త త‌ల‌నొప్పులు తెస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీలో ఎమ్మెల్యేలు.. జుట్టు జుట్టు ప‌ట్టుకునే వ‌ర‌కు వివాదాలు న‌డుస్తున్నాయ‌ని.. చెబుతున్నారు. అంతేకాదు.. హ‌ద్దులు దాటి మ‌రీ వ్యాఖ్య‌లు చేసుకుంటు న్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. దీంతో ఇప్ప‌టికే ఉన్న ఆధిప‌త్య పోరుకు.. ఇది కొత్త వివాదంగా మారింద‌ని.. చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. జ‌గ‌న‌న్న కాల‌నీల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం సంక‌ల్పించింది.

ఇల్లు లేని పేద‌ల‌కు ఇల్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 27 ల‌క్ష‌ల మందికి ఇళ్ల స్థ‌లాల‌ను కూడా ప్ర‌భుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించి సొంత గా ఇల్లు నిర్మించుకునేవారికి ప్ర‌భుత్వ‌మే ప్రోత్సాహ‌కంగా కొంత సామాగ్రి అందిస్తోంది. అదేస‌మ‌యంలో ఖ‌ర్చును కూడా రీయింబ‌ర్స్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దీంతో కొంద‌రు సొంత‌గానే శంకుస్థాప‌న‌లు చేసుకుని.. ఇళ్లు క‌ట్టుకుంటున్నారు. అయితే.. ఏమాత్రం ఆర్థిక భ‌రోసా లేని కుటుంబాలు.. మాత్రం ప్ర‌భుత్వం క‌ట్టిస్తేనే.. త‌ప్ప త‌మ‌కు అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

దీంతో ప్ర‌భుత్వ‌మే.. వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌, నిర్మాణ సామాగ్రి ఏర్పాటు వంటి బాధ్య‌త‌ల‌ను జిల్లాల ఇంచార్జ్ మంత్రుల‌కు ప్ర‌భుత్వం అప్ప‌గించింది. ఇంత వ‌ర‌కుబాగానే ఉన్నా.. ఇక్క‌డే ఎమ్మెల్యేల ఆధిప‌త్య పోరు ప్రారంభ‌మైంది. ఎలాగంటే.. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న పేద‌ల‌కు.. వేరే నియోజ‌క‌వ‌ర్గంలో అంటే.. స్థ‌లాలు ఎక్క‌డ అనువుగా ఉంటే.. అక్క‌డ ప్ర‌భుత్వం స్థ‌లాల‌ను కేటాయించింది. దీంతో అక్క‌డ ప‌నులు చేప‌ట్టాల్సి ఉంది. దీనిని బ‌ట్టి.. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు..వేరే నియోజ‌క‌వ‌ర్గంలో కేటాయించిన చోట ప‌నులు చేప‌ట్టాలి.

ఇదే.. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక‌రిపై ఒకరు ఆధిప‌త్యం చ‌లాయించుకునేందుకు ఆస్కారం ఇచ్చిన‌ట్టు అయింది. ``మా నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు పొరుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఇళ్లు కేటాయించారు. వారికి నాణ్య‌మైన స‌రుకులు అప్ప‌గించి.. నాణ్య‌మైన ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త నాదే`` అని ఒక ఎమ్మెల్యే అంటే.. `` అలా ఎలా కుదురుతుంది? వారికి నా నియోజ‌క‌వ‌ర్గంలో స్థ‌లాల‌ను కేటాయించారు కాబ‌ట్టి.. ఇక్క‌డ నేను చెప్పిందే జ‌ర‌గాలి`` అని ఇవ‌త‌లి ప‌క్షం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే చెబుతున్నారు. దీంతో ఈ ఎమ్మెల్యేల వైఖ‌రిని స‌ర్దిచెప్ప‌లేక‌.. ఇంచార్జ్ మంత్రులు న‌లిగిపోతున్నారు. దీంతో వారు స‌ద‌రు ప‌నులు క‌ట్టిపెట్టి.. వేరే ప‌నులు చూసుకుంటున్నారు. దీంతో ప్ర‌భుత్వం నిర్దేశిత ల‌క్ష్య‌మైన పేద‌ల‌కు ఇళ్లు ప‌థ‌కం ముందుకు సాగుతుందా? లేదా? అనే సందేహాలు నెల‌కొన్నాయి.