Begin typing your search above and press return to search.
వైసీపీ రెడీ!... టీడీపీ అరాచకాలపై పోరేనట!
By: Tupaki Desk | 23 Oct 2017 4:13 AM GMTవచ్చే 2019లో ఏపీలో అధికారం సాధించడమే ధ్యేయంగా ముందుకు కదలుతామని - ఆ కార్యాచరణ దిశగా అడుగులు వేస్తామని వైసీపీ నేతలు ప్రతిజ్ఞ చేశారు. పార్టీ అద్యక్షుడు జగన్ సీఎం కావడమే ధ్యేయంగా ప్రజల్లోకి కార్యకర్తలు - నేతలు వెళ్లాలని - అధికార పార్టీ టీడీపీ అరాచకాలపై పెద్ద ఎత్తున పోరు సాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు వైసీపీ ప్రచార కమిటీ ఓ తీర్మానం చేసింది. ఆదివారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ఓ సమావేశం నిర్వహించింది. పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు విజయచందర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్దసారధి మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన పథకాలను - నవరత్నాలను ప్రజలలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ ప్రచార కమిటీపై ఉందన్నారు.
పత్రికలు - చానళ్ల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేపట్టాలని సూచించారు. పార్టీ పటిష్టతకు కూడా ప్రచార కమిటీ పాటుపడాలన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ఏ ఒక్కరిలోనూ అశ్రద్ధ కనిపించకూడదని, అంతా ఏదో జరుగుతుందిలో అని ఎవ్వరూ అనుకోరాదని హెచ్చరించారు. జగన్ భావాలను అర్ధం చేసుకుని - ప్రజల్లో ప్రచారం ప్రారంభించాలన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ప్రచార కమిటీలపై గురుతర భాద్యత ఉందని అది గుర్తుంచుకుని నేతలు పని చేయాలని కోరారు. పార్టీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పార్టీని - పార్టీ విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లడం అనేది ప్రచార కమిటీ పనితీరు పై ఆధారపడి ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఊరికి - గ్రామగ్రామానికి పార్టీ పథకాలను తీసుకువెళ్లడంతో పాటు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జొన్నల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టే వరకూ విశ్రమించేది లేదని, ప్రచార కమిటీల కార్యకర్తలందరూ సైనికుల్లా పని చేస్తారని తెలిపారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ద్వారా ఆ పార్టీ బాగోతాలను వివరించాలని, ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వెలుగులోకి తీసుకురావాలని పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా నడుచుకోవడం ద్వారానే పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. దీంతో వైసీపీలో నూతనోత్సాహం వెల్లి విరిసిందని నేతలు పేర్కొన్నారు.