Begin typing your search above and press return to search.
జగన్ పార్టీలో ఫిరాయింపుల బ్యాచ్ రెడీ
By: Tupaki Desk | 9 Dec 2015 7:24 AM GMT2019 ఎన్నికలు లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీని ఖాళీ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టార్గెట్ పెట్టుకున్నారా..? అందులో భాగంగా వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలను ప్రోత్సహించబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు వైసీపీ నుంచి నేరుగా కాకపోయినా వైసీపీలోకి వెళ్లి మళ్లీ బయటకు వచ్చేసి కొద్దికాలం గ్యాప్ తీసుకుని టీడీపీలో చేరుతున్నారు. ఇక వైసీపీ నుంచి గెలిచినవారైతే టెక్నికల్ గా ఇబ్బంది వస్తుంది కాబట్టి టీడీపీలో చేరాం అని చెప్పకుండా టీడీపీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వైసీపీ అంటే ఏమిటో మర్చిపోయినవారున్నారు. ఎంపీలు బుట్టా రేణుక - కొత్తపల్లి గీత వంటివారు టీడీపీ కండువా కప్పుకోకపోయినా వైసీపీ ఆఫీసు ముఖం చూడడం మానేసి చాలా కాలమైపోయింది. ఈ తరుణంలో ఎమ్మెల్యేల విషయంలో ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లెం కూడా రాకుండా ఒకేసారి ఎక్కువమంది ఫిరాయించేలా చేసి టీడీపీ కండువా కప్పాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. దానికోసం ఇప్పటికే కొందరిని గుర్తించారని వారిలో టీడీపీలోకి రావడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నవారు 8 మంది ఉన్నట్లు సమాచారం.
కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీ ప్రవేశానికి రంగం సిద్ధమవుతుండగా కర్నూలు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు సైకిలెక్కే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్రలో నలుగురు ఎమ్మెల్యేలు సైకిల్ పై సవారీకి సై అంటున్నారట. మొత్తానికి ఒకరు ఇద్దరిని పార్టీలోకి తీసుకుని రచ్చరచ్చ చేసుకునే కంటే పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలను గోడ దూకించి జగన్ ను మానసికంగానూ దెబ్బకొట్టాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. ఇది పక్కాగా అమలైతే జగన్ పార్టీలో తుపాను తప్పదు.